Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, మూడ్రోజులు ఏపీ , తెలంగాణకు వర్షాలు
Rains Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన జారీ అయింది, రానున్న మూడ్రోజులు తెలంగాణలో మోస్తరు వర్షాలు పడనుండగా, ఏపీలో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే మూడ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇలా ఉండనుంది.
Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణలో మోస్తరు వర్షాలు పడతా.యని ఏపీలో మాత్రం భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏయే జిల్లాల్లో వర్షాలు పడనున్నాయో తెలుసుకుందాం.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్, నల్గొండ, మేడ్చల్, మహబూబాబాద్, సూర్యాపేట్, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ పది జిల్లాలలకు ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఉదయం నుంచి తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. రేపు, ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. రేపు రాత్రి వరకూ బలమైన గాలులు కూడా వీయనున్నాయి. వచ్చే మూడ్రోజులు తెలంగాణలో వాతావరణం ఇలానే ఉండనుంది. రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ములుగు, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల్లో మాత్రం ఇవాళ భారీ వర్షం పడవచ్చు.
మరోవైపు ఏపీలో సైతం రానున్న మూడ్రోజులు వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని..జాలర్లు వేటకు వెళ్లవద్దని సూచించారు. ఏపీలో కృష్ణా, బాపట్ల, పార్వతీపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook