IMD Weather Alert: ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్ల ఇంకా చలి తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. పగటి ఉష్ణోగ్రతలో మాత్రం కొద్దిగా మార్పు కన్పిస్తోంది. రానున్న వారం రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయని ఐఎండీ సూచించింది. రేపట్నించి ఫిబ్రవరి 4 వరకూ వర్షాలు పడవచ్చని అంచనా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరాదిన ఇంకా చలితీవ్రత తగ్గనే లేదు..వాతావరణ శాఖ నుంచి వస్తున్న సూచనలు ఇంకా వణికిస్తున్నాయి. రేపట్నించి ఫిబ్రవరి 4 వరకూ దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయని తెలుస్తోంది. ఫలితంగా ఈ రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనుండటం వల్ల ఉష్ణోగ్రత 3-4 డిగ్రీలు పడిపోవచ్చని తెలుస్తోంది. ఫలితంగా చలి తీవ్రత పెరగవచ్చు. రేపు అంటే జనవరి 31న దేశ రాజధాని ఢిల్లీలో తేలికపాటి వర్షం పడవచ్చు. 


డిల్లీ, హర్యానా, యూపీ, పంజాబ్, చండీగడ్, ఉత్తర రాజస్థాన్, బీహార్, జార్ఘండ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కనీస ఉష్ణోగ్రత 7-10 డిగ్రీలు ఉండవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక పంజాబ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ విషయంలో పొగమంచు కారణంగా ఎల్లో అలర్ట్ జారీ అయింది. రానున్న 24 గంటల్లో పగలు కూడా పెద్దఎత్తున పొగమంచు ఉంటుందని తెలుస్తోంది. 


మరోవైపు స్కైమెట్ వాతావరణ సంస్థ ప్రకారం రానున్న 24 గంటల్లో గిల్గిట్ బాల్టిస్తాన్, ముజఫ్పరాబాద్, లడఖ్, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, పొగమంచు కురుస్తాయి. ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం పడవచ్చు.


ఇక అండమాన్ నికోబర్ దీవులు, సిక్కిం, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడులో తేలికపాటి వర్షసూచన ఉంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలోని చాలా ప్రాంతాల్లో పగలు, రాత్రి పెద్దఎత్తున మంచు కురవనుంది. బీహార్, ఉత్తర మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో భారీగా మంచు కురవనుంది. 


Also read: Family Pension Rules: పెన్షన్ నిబంధనల్లో మార్పు, మహిళా ఉద్యోగులు పెన్షన్‌కు పిల్లల్ని నామినేట్ చేయవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook