Fake Scams on Ration Card: ఎక్కడ చిన్న అవకాశం దొరికినా ఆన్‌లైన్ కేటుగాళ్లు దోచుకునేందుకు రెడీ అవుతున్నారు. తమ కాల్స్‌కు అమాయకులు కాస్త రెస్పాన్స్ ఇస్తే చాలు.. కొత్త స్కీమ్ అని.. కేవైసీ అప్‌డేట్ అని నిండా ముంచేస్తారు. రేషన్ కార్డు పేరుతో దందాలకు నకిలీ రాయుళ్లు తెరలేపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఫ్రీ రేషన్ పథకం ఇప్పటికీ కొనసాగుతోంది. కార్డ్ హోల్డర్లకు డిసెంబర్ 2023 వరకు ప్రభుత్వం ఉచిత రేషన్ అందజేయనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కుటుంబంలోని ప్రతి సభ్యులను బట్టి రేషన్ అందజేస్తారు. 


ప్రభుత్వ అధికారులు రేషన్ కార్డుల జాబితాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటారు. చనిపోయిన వారి పేర్లు తొలగించడం.. కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయడం వంటి ప్రక్రియలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. అయితే దీన్ని అవకాశంగా తీసుకుని ప్రజలను మోసం చేస్తున్నారు దుండగులు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. కొందరు గుడ్డిగా నమ్మి మోసగాళ్ల మాయలో పడుతున్నారు. 


Also Read: Earthquake In Delhi: భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు  


రెవెన్యూ అధికారులంటూ పరిచయం చేసుకుని.. రేషన్‌ కార్డులో మీ పేరు తొలగించామని చెబుతారు. తాము చెప్పినట్లు చేస్తే మీ పేరు మళ్లీ రేషన్ కార్డులోకి జత చేస్తామని అంటారు. అలా కేటుగాళ్లు పంపిన లింక్‌లు క్లిక్ చేసి చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. మీ అకౌంట్‌లోకి ఉచిత రేషన్ డబ్బు కావాలంటే.. ఈ లింక్‌పై క్లిక్ చేయండి అని మెసేజ్ వస్తే అస్సలు క్లిక్ చేయకండి. ఈ లింక్‌పై క్లిక్ చేస్తే.. మీ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం. ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి పథకం అమలు చేయడం లేదు. 


ఉచిత రేషన్ కార్డు లబ్ధిదారులకు కాల్ చేసి.. కేవైసీ అప్‌డేట్ చేయాలంటూ ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మీకు ఇలాంటి కాల్స్ వస్తే.. వెంటనే కట్ చేయండి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీపీ, బ్యాంక్ వివరాలను పంచుకోవచ్చు. ఫేక్‌ లింక్‌లు, ఫేక్ కాల్స్‌కు అస్సలు స్పందించకండి.. ఆన్‌లైన్ కేటుగాళ్ల మాయలో పడకండి. జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. 


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి