భారత ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రసంగం ప్రారంభంలోనే ఆయన గురుగోవింద్ సింగ్ కు నివాళులు అర్పించారు. ఎన్నో తరాలవారికి సింగ్ ప్రభావితం చేశారని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు 


* ప్రజాస్వామ్యంలో అతిపెద్ద శక్తి ఓటు. ఓటు దేశ పురోగతిని నిర్దేశిస్తుంది. 


*  నవభారత యువత దేశ గమనాన్ని నిర్దేశిస్తారు. వారిపాత్ర కీలకం. కులం, మతం, అవినీతి భారత్, విద్వేషాలు లేని దేశాన్ని యువత చూడాలనుకోంటోంది. 


* పేదరిక నిర్మూలన దిశగా దేశం పయనిస్తోంది. 


* త్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లిం మహిళలకు బాధల నుండి విముక్తి.


* ప్రజల నుంచి వచ్చిన సూచనలు ఎంతో విలువైనవి. 


* దక్షిణ భారతదేశంలో జరిగే అతిపెద్ద పండుగలలో ఒకటైన మకర సంక్రాంతి గురించి ప్రస్తావిస్తూ.. ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. 


* స్వచ్ భారత్ మిషన్ పై దృష్టిపెడతాం. పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత స్థాయిలో సాధించిన విజయాలను అంచనా వేయడానికి జనవరి 4- 10, 2018 నుండి పరిశుభ్రత సర్వేలను నిర్వహిస్తాం.


* అంజుమ్ బషీర్ ఖాన్ ఖట్టాక్, జమ్మూ కాశ్మీర్ కే కాదు.. దేశానికే స్ఫూర్తి.


*హజ్ రూల్స్ పై మాట్లాడుతూ-  మెహ్రామ్ (మగ సంరక్షకుడు) తో మాత్రమే ముస్లిం మహిళలు హజ్ కు వెళ్లేవారు. కానీ ఇప్పడు వారు 'మెహ్రామ్' లేకుండానే హజ్ కు వెళ్ళవచ్చు. ఆ విధంగా మేము రూల్స్ మార్చాము. ఈ ఏడాది 1300 మంది మహిళలు మెహ్రామ్ లేకుండా ప్రయాణించడానికి అనుమతి తీసుకున్నారు. (*కానీ, ఆ మహిళలు మహిళల బృందంలో ఉంటారు)   


* జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడులకు ప్రత్యేకమైనవి. 10 ఆసియన్ దేశాల నుంచి నాయకులు ముఖ్య అతిథులుగా హాజరవుతారు.