గుజరాత్ ముఖ్యమంత్రి మరియు బీజేపీ నేత విజయ్ రూపానీ రాజ్‌కోట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 21 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 61 ఏళ్ళ రూపానీ, అప్పటి సీఎం ఆనందీ బెన్ పదవి నుండి తప్పుకున్నాక 7 ఆగస్టు 2016 తేదిన గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బర్మాలో పుట్టి పెరిగిన రూపానీ చిన్నప్పుడే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. 1996లో బిజేపీ అభ్యర్థిగా రాజ్‌కోట్‌ ప్రాంతానికి మేయరుగా ఎన్నికయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2006లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రనీల్ పై గెలుపొందారు. తొలుత రూపానీ మీద ఓట్లలో ఇంద్రనీల్ పైచేయి సాధించినా.. చివర విడత ఓట్ల లెక్కింపులో కథ మారిపోయింది. పోస్టల్ బ్యాలట్ ఓట్లను కూడా లెక్కబెట్టాక, రూపానీ తన సమీప అభర్థిపై మెజారిటీ సాధించి గెలుపొందారు.