Income Tax: ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల కాలం నడుస్తున్నా ఇంకా నగదు లావాదేవీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఐటీ నిఘా పడకుండా ఉండేందుకు ఇప్పటికీ చాలామంది నగదు లావాదేవీలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. చిన్న చిన్న షాపింగుల్లో నగదు లావాదేవీలు చేస్తే ఫరవాలేదు కానీ ఐదు రకాల భారీ లావాదేవీలు నగదు రూపంలో చేస్తే అది మీకు భారంగా పరిణమించవచ్చు. ఇన్‌కంటాక్స్ నుంచి మీకు నోటీసులు అందవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నిబంధనల ప్రకారం ఒకే ఆర్ధిక సంవత్సరంలో 10 లక్షలు అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే అది నేరుగా ఇన్‌కంటాక్స్ శాఖకు చేరుతుంది. ఆ డబ్బు ఒకటి కంటే ఎక్కువ ఎక్కౌంట్లలోకి బదిలీ అయినా సరా ఐటీ నిఘా ఉంటుంది. నిర్ణీత పరిమితి దాటి ఉండటం వల్ల ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసుల రావచ్చు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆధారం చూపించాల్సి వస్తుంది. 


ఇక రెండవది ఒకే ఆర్ధిక సంవత్సరంలో 10 లక్షలు దాటి డిపాజిట్ చేసినట్టే..ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కూడా వర్తిస్తుంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో పది లక్షలు దాటితే మీకు సమస్యగా మారవచ్చు. ఆ డబ్బు ఎక్కడ్నించి వచ్చిందో ఐటీకు లెక్క చెప్పాల్సి వస్తుంది.


ఏదైనా ఆస్థి కొనుగోలు చేసేటప్పుడు  30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీ జరిగింతే సంబంధిత రిజిస్ట్రార్ ఆ సమాచారాన్ని నేరుగా ఇన్‌కంటాక్స్ శాఖకు చేరవేయాల్సి వస్తుంది. అంత డబ్బు ఎక్కడ్నించి వచ్చిందో ఇన్‌కంటాక్స్ శాఖకు చెప్పాల్సి వస్తుంది. 


క్రెడిట్ కార్డు బిల్లు 1 లక్ష దాటి ఉండి నగదు రూపంలో బిల్లు చెల్లించినా ఆ డబ్బు ఎక్కడ్నించి వచ్చిందో చెప్పాల్సి వస్తుంది. ఏదైనా సరే ఒకే ఆర్ధిక సంవత్సరంలో 10 లక్షలు దాటితే ఇన్‌కంటాక్స్ శాఖకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.


ఇక చివరిది షేర్లు, మ్యూచ్యువల్ ఫండ్స్, బాండ్స్ వంటివి కొనుగోలు చేసేందుకు పెద్దమొత్తంలో నగదు లావాదేవీ జరిపితే ఇన్‌కంటాక్స్ శాఖ అప్రమత్తమౌతుంది. సంబంధిత సమాచారం ఆదాయ పన్ను శాఖకు చేరుతుంది. ఆ డబ్బు ఆధారం ఎక్కడిదని ప్రశ్నిస్తూ నోటీసులు పంపిస్తుంది. 


Also read: FD Rate Hike: ఫిక్స్డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేట్లు, ఏ బ్యాంకు ఎంత ఇస్తుందో తెలుసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook