ITR Refund Scam: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే గడువు ముగిసింది. జూలై 31న గడువు ముగిసేనాటికి దేశవ్యాప్తంగా 7 కోట్ల 28 లక్షలమంది రిటర్న్స్ ఫైల్ చేశారు. ఇప్పుడిక డిసెంబర్ 31 వరకూ జరిమానాతో దాఖలు చేయాల్సి ఉంది. ఇప్పటికే రిటర్న్స్ దాఖలు చేసినవాళ్లంతా రిఫండ్ కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో రిఫండ్ స్కామ్ వెలుగుచూసింది. ఈ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్‌కంటాక్స్ శాఖ ప్రజల్ని అలర్ట్ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో కొత్త తరహా మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ప్రీ టెక్స్ట్ పంపించి స్కామ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తరహా స్కాంల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిస్తోంది. ఫోన్‌లో మెస్సేజ్ ద్వారా లేక మెయిల్ ద్వారా పాప్ అప్ నోటిఫికేషన్ వస్తుంటుంది. మీరు ఇన్‌కంటాక్స్ రిఫండ్‌కు అర్హులంటా నోటిఫికేషన్ వస్తుంది. ఈ తరహా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే ఇన్‌కంటాక్స్ అధికారులతో నేరుగా మాట్లాడాలని సూచిస్తోంది. 


ఇన్‌కంటాక్స్ రిఫండ్ స్కామ్ ఏంటసలు


ఈ స్కాంలో భాగంగా మీ మొబైల్‌కు పాప్ అప్ నోటిఫికేషన్ వస్తుంది. అందులో కంగ్రాట్యులేషన్స్...మీరు 15 వేల రిఫండ్‌కు అర్హులయ్యారు మీ ఎక్కౌంట్ నెంబర్ వెరిఫై చేసుకుని రిఫండ్ పొందమంటూ ఉంటుంది. లింక్ ఇచ్చి క్లిక్ చేయమంటారు. ఆ లింక్ క్లిక్ చేసి మీ ఎక్కౌంట్ సమాచారం అడుగుతారు. అదంతా ఫిల్ చేసి ఇచ్చారంటే మీ ఎక్కౌంట్ నుంచి డబ్బులు మాయమౌతాయి


ఈ తరహా రిఫండ్ స్కామ్ దృష్టిలో ఉంచుకుని ఇన్‌కంటాక్స్ శాఖ ఎక్స్ వేదికగా అందర్నీ ముఖ్యంగా ట్యాక్స్ పేయర్లను హెచ్చరించింది. ఈ తరహా మెస్సేజ్‌లకు స్పందించవద్దని కోరుతోంది. రిఫండ్‌కు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే నేరుగా ఇన్‌కంటాక్స్ శాఖ సిబ్బందిలో మాట్లాడాలని కోరుతోంది. 


Also read: Jio 999 Recharge Plan: జియో నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్, అన్‌లిమిటెడ్ హై స్పీడ్ డేటా, 15 ఓటీటీ సేవలు ఉచితం



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook