PM Modi on National Unity Day: ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉంది - మోదీ
Vallabhai Patel’s birth anniversary:ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే దేశం తన లక్ష్యాలను చేరుకుంటుందని ఆయన వెల్లడించారు. భారత తొలి ఉపప్రధాని, తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ మాట్లాడారు.
India capable of meeting any challenge, says PM Modi on Vallabhai Patel’s birth anniversary: అంతర్గతంగా లేదా బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం భారతదేశానికి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) వెల్లడించారు. ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే దేశం తన లక్ష్యాలను చేరుకుంటుందని ఆయన వెల్లడించారు. భారత తొలి ఉపప్రధాని, తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ మాట్లాడారు. సర్దార్ పటేల్ జయంతిని (Vallabhai Patels birth anniversary) జాతీయ ఐక్యతా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.
Also Read : India Vs New Zealand: భారత్‌ను కలవరపెడుతున్న ఆ ఇద్దరు న్యూజిలాండ్ బౌలర్లు
భారత్ ఇప్పుడు అన్ని రకాలుగా ముందుకెళ్తుందన్నారు. వాయు మార్గంలో, భూమార్గంలో, జల మార్గాల్లో భారత్ శక్తిసామర్థ్యాలు మునుపెన్నడూ లేనంతంగా ఇప్పుడు ఉన్నాయన్నారు. భారత్ (India) ఎల్లప్పుడూ సమర్థవంతమైన, సున్నితమైన, అప్రమత్తతతో, వినయంగా ఉంటూ అందరినీ కలుపుకునేతత్వంతో అభివృద్ధి చెందాలని సర్దార్ పటేల్ ఎల్లప్పుడూ కోరుకునేవారని ప్రధాని మోదీ (Prime Minister Modi) అన్నారు.
అలా ఆయన నుంచి పొందిన స్ఫూర్తితోనే అంతర్గతంగా, బయట నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే పూర్తి శక్తి సామర్థ్యాలు భారత్ కు ఉన్నాయన్నారు. ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ కోసం జీవితం అంకితం చేసిన సర్దార్ పటేల్‌కు యావత్ దేశం నివాళులు అర్పిస్తోందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు.
Also Read : Rakesh Tikait : ప్రభుత్వ కార్యాలయాలను రైతు మార్కెట్లుగా మారుస్తామంటున్న రాకేశ్ టికాయత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి