India corona Update: కరోనా థార్డ్​వేవ్​ ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. దేశంలో రోజువారి కొత్త కేసులు భారగా తగ్గుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా 24 గంటల్లో 67,597 మందికి కొవిడ్ సోకినట్లు సోమవారం ప్రకటించింది వైద్య ఆరోగ్య శాఖ. రోజువారీ పాజిటీవిటి రేటు 5.02 శాతానికి తగ్గినట్లు పేర్కొంది.


యాక్టివ్​  కేసులు ఇలా..


దేశంలో యాక్టివ్​ కేసులు కూడా భారీగా తగ్గాయి. క్రితం రోజు 11 లక్షలపైన ఉన్న యాక్టివ్ కేసుల నేడు 10 లక్షల దిగువకు పడిపోయాయి.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,94,891 మంది కొవిడ్ చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.


మరణాలు ఇలా..


నిన్నటితో పోలిస్తే మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. తాజాగా కొవిడ్​కు 1,188 మంది బలయ్యారు. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం మరణాలు 5,040,62 వద్దకు చేరాయి.


రికవరీలు ఇలా..


ఇక సోమవారం ఒక్క రోజే 1,804,56 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 42,339,611 మంది కొవిడ్ బారిన పడగా.. అందులో 40,840,658 మంది మహమ్మారిని జయించారు.


వ్యాక్సినేషన్ ఇలా..


దేశంలో టీకా డోసుల పంపిణీ మరో మైలురాయి దాటింది. తాజాగా 55,78,297 డోసుల టీకాలు పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,70,21,72,615 డోసులు పంపిణీ చేశారు.


Also read: Asaduddin Owaisi Z security: అసదుద్దిన్ ఒవైసిపై కాల్పులు నేపథ్యంలో ఒవైసికి అమిత్ షా రిక్వెస్ట్


Also read: Rahul Gandhi Security Lapse: పంజాబ్​లో మరోసారి భద్రతా లోపం- ఈ సారి రాహుల్ గాంధీకి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter