Asaduddin Owaisi Z security: అసదుద్దిన్ ఒవైసిపై కాల్పులు నేపథ్యంలో ఒవైసికి అమిత్ షా రిక్వెస్ట్

Asaduddin Owaisi Z security: ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ Z సెక్యూరిటీని అంగీకరించాలని కోరారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆయకు ఇంకా ముప్పు పొంచి ఉందని తెలిపారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2022, 05:54 PM IST
  • Z సెక్యూరిటీ అంగీకరించాలని ఓవైసికి అమిత్ సూచన
  • ఇటీవలి కాల్పుల ఘటన నేపథ్యంలో రాజ్య సభలో ప్రకటన
  • ముప్పు ఇంకా పొంచి ఉందని వెల్లడి
Asaduddin Owaisi Z security: అసదుద్దిన్ ఒవైసిపై కాల్పులు నేపథ్యంలో ఒవైసికి అమిత్ షా రిక్వెస్ట్

Asaduddin Owaisi Z security: హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ భద్రతపై పార్లమెంట్​లో ప్రకటన చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్​షా. ఒవైసీకి ఇంకా ముప్పు ఉన్నట్లు తమ విచారణలో తేలినట్లు వెల్లడిచారు. ఈ కారణంగా ఆయన.. ప్రభుత్వ ఇటీవల కేటాయించిన Z క్యాటగిరీ సెక్యూరిటీని అంగీకరించాలని కోరారు.

రాజ్య సభలో ఈ విషయాన్ని ప్రస్తావించిన అమిత్ షా. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఫిబ్రవరి 3న ఒవైసీ కారుపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనలతో ఒవైసీ సురక్షితంగా బయటపడ్డారన్నారు. ఆయన కారుపై మాత్రమే మూడు బుల్లెట్​ గుర్తులు పడ్డట్లు వివరించారు. ఈ ఘటనపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.

అసలు ఏమైందంటే..

యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ అభ్యర్థి తరఫున మీరఠ్​లో ప్రచారం కోసం వెళ్లారు. ప్రచారం ముగించుకుని ఢిల్లీకి వస్తున్న ఆయన కారుపై హాపూర్​ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఈ ఘటనతో ఒక్క సారిగా హోం శాఖ అప్రమత్తమైంది. ఒవైసీకి భద్రత పెంచాలని నిర్ణయం తీసుకుంది. మరునాడే ఆయనకు Z సెక్యూరిటీ భద్రతను ఇస్తున్నట్లు ప్రకటించింది.

అయితే కేంద్రం ప్రకటించిన Z సెక్యూరిటీని అసదుద్దీన్‌ ఒవైసీ తిరస్కరించారు. తాను సామాన్యులతోనే ఉంటానని.. వాళ్లు సేఫ్​గా ఉన్నప్పుడే తాను సురక్షితమన్నారు.

ఈ పరిణామాల నేఫథ్యంలో ఒవైసీకి ఇంకా ముప్పు పొంచి ఉందని.. అందుకే భద్రత పెంపునకు అంగీకరించాలని కోరుతూ హోం మంత్రి అమిత్ షా రాజ్య సభలో కోరారు.

Also read: Rahul Gandhi Security Lapse: పంజాబ్​లో మరోసారి భద్రతా లోపం- ఈ సారి రాహుల్ గాంధీకి..

Also read: Tribute To Lata Mangeshkar: దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌కు రాజ్యసభ నివాళి.. గంట పాటు వాయిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News