Corona updates in India: రెండో రోజు 3 వేలకు దిగువకు కరోనా కేసులు.. 97 మంది మృతి
భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,568 కేసులు నమోదవ్వగా.. 97 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
India Corona Updates: భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. వరుసగా రెండోరోజు 3 వేలకు దిగువకు కేసులు నమోదైయ్యాయి. ఐతే మరణాల సంఖ్య మాత్రం వందకు చేరువైంది. ఈమేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 7 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2 వేల 568 మందికి వైరస్ ఉందని తేలింది. మొత్తం కేసుల సంఖ్య 4.29 కోట్లకు చేరింది.
తాజాగా కరోనా మహమ్మారి కారణంగా 97 మంది మృతి చెందారు. ఇందులో ఒక్క కేరళ నుంచే 78 మరణాలు నమోదయ్యాయి. గత కొంతకాలంగా కరోనా కేసులు తగ్గుతున్నా.. మరణాల సంఖ్యలో మాత్రం తేడా కనిపిస్తోంది.
ఇప్పటివరకు వైరస్ వల్ల 5.15 లక్షల మంది మృత్యువాత పడ్డారు. కోవిడ్ వ్యాప్తి అదుపులోకి వస్తుండటంతో బాధితుల సంఖ్య 33 వేల 917కి చేసింది. మొత్తం కేసుల్లో ఈ వాటా 0.08 శాతంగా ఉంది. తాజాగా కరోనా వైరస్ నుంచి 4 వేల 722 మంది కోలుకున్నారు. ఇవాళ్టి వరకు 4.24 కోట్ల మంది వైరస్ ను జయించారు. రికవరీ రేటు 98.72 శాతానికి చేరింది.
మరోవైపు దేశ్యాప్తంగా టీకా ఉద్యమం కొనసాగుతోంది. ఇప్పటివరకు 180 కోట్లు డోసులను పంపిణీ చేశారు. రేపటి నుంచి టీకా కార్యక్రమంలో మరో దశ ప్రారంభంకానుంది. 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు టీకాను అందించనున్నారు. ఈ విషయాన్ని కేంద్రారోగ్యశాఖ వెల్లడించింది. వీరితోపాటు వృద్ధులకు ప్రికాషనరీ డోసు కూడా పంపిణీ చేస్తారు.
Also Read: Radheshyam vs Kashmir Files: రాధేశ్యామ్‌కు హిందీలో..కశ్మీర్ ఫైల్స్ నుంచి ఎదురవుతున్న పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook