Gold and Silver Rates Today: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధర! నేటి బంగారం, వెండి రేట్లు ఇవే!!

March 15th 2022 Gold and Silver Rates In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470గా ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 15, 2022, 07:37 AM IST
  • పసిడి ప్రియులకు శుభవార్త
  • తగ్గిన బంగారం ధరలు
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఎంతంటే
Gold and Silver Rates Today: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధర! నేటి బంగారం, వెండి రేట్లు ఇవే!!

March 15th 2022 Gold and Silver Rates: ఉక్రెయిన్‌, రష్యాల దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ ప్రభావం ఇతర దేశాలపై భారీగానే పడింది. బ్యారెల్ ధర, తులం బంగారం ధర రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌, రష్యాల నుంచి దిగుమతి ఎక్కువగా ఉండే భారత్‌లో దీని ప్రభావం తీవ్రంగానే పడింది. ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఏకంగా ఆల్‌టైమ్‌ హైకి చేరుకున్నాయి. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేట్ దాదాపుగా రూ. 53 వేలు అయింది. అయితే ఈరోజు (మార్చి 15) గోల్డ్ రేట్స్ కాస్త తగ్గాయి. 

మంగళవారం (మార్చి 15)న దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 400లకు పైగా తగ్గింది. ఇక దేశీయ మార్కెట్లో వెండి ధర కూడా భారీగానే దిగి వచ్చింది. దేశీయంగా కిలో వెండిపై ఏకంగా రూ.4,700 వేలకు పైగా తగ్గింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,470గా ఉంది. వాణిజ్య నగరం ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,470గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,690గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.53,120 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100.. 24 క్యారెట్ల ధర రూ.52,470గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.48,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,470గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.48,100.. 24 క్యారెట్ల ధర రూ.52,470గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.48,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,470 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర భారీగా తగ్గింది. నిన్నటితో పోల్చితే ఏకంగా రూ. 4700 తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,200లుగా ఉంది. 

Also Read: Today Horoscope March 15 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్త అందుతుంది!!

Also Read: Radheshyam vs Kashmir Files: రాధేశ్యామ్‌కు హిందీలో..కశ్మీర్ ఫైల్స్ నుంచి ఎదురవుతున్న పోటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News