India Covid-19 recovery rate rises: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్‌ ( coronavirus ) బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో నిరంతరం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటం కొంచెం ఊరట కలిగిస్తోంది. గత 24గంటల్లో కరోనా నుంచి రికార్డు స్థాయిలో 62,282 మంది రోగులు కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 21 లక్షల 60,05 చేరింది. దీంతో దేశవ్యాప్తంగా రికవరీ రేటు 74.30 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Health Ministry ) శుక్రవారం వెల్లడించింది. దీంతో దేశంలో రికవరీల సంఖ్య 21,58,946కు పెరిగిందని వెల్లడించింది. అంతేకాకుండా ఈ మహమ్మారి మరణాల రేటు కూడా 1.9 శాతానికి పడిపోయినట్లు పేర్కొంది. Also read: Srisailam fire accident: అత్యంత దురదృష్టకరం...ప్రధాని మోదీ ట్వీట్



దేశంలో కోవిడ్ పరీక్షా కేంద్రాల సంఖ్య కూడా పెరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికి 1,504 పరీక్షా కేంద్రాలున్నాయని, వాటిలో.. 978 ప్రభుత్వ ల్యాబ్‌లు, 526 ప్రైవేటు ల్యాబ్‌లు ఉన్నట్లు పేర్కొంది. గత 24 గంటల్లో అత్యధికంగా 9,05,985 నమూనాలకు పరీక్షించినట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే.. గడిచిన 24 గంటల్లో 68,898 కేసులు నమోదు కాగా.. 983 మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,05,823కు చేరగా.. మరణాల సంఖ్య 54,849కు పెరిగింది. Also read: Lalu Prasad Yadav: లాలూ సెక్యూరిటీలో 9 మందికి కరోనా