India CoronaVirus Tests: కరోనా మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి త్వరగా పాజిటివ్ బాధితులను గుర్తించి చికిత్స అందిస్తోంది. ఈ క్రమంలో భారత్‌లో కరోనా టెస్టుల సంఖ్య 44 కోట్లకు చేరుకుంది. దేశంలో కరోనా రికవరీ రేటు 97.28 శాతానికి చేరుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో జులై 16 ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 19 లక్షల 55 వేల 910 శాంపిల్స్ పరీక్షించగా 38,949 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,26,829 (3 కోట్ల 10 లక్షల 26 వేల 829)కు చేరుకుంది. నిన్నటితో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు స్వల్పంగా తగ్గాయి. కరోనా వైరస్‌ (CoronaVirus)తో పోరాడుతూ మరో 542 మంది మరణించగా, ఇండియాలో ఇప్పటివరకూ 4,12,531 (4 లక్షల 12 వేల 531) మంది చనిపోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కరోనా థర్డ్ వేవ్ త్వరగా వస్తుందని, వ్యాక్సినేషన్ సైతం చేయించుకుని కరోనా వ్యాప్తిని అరికట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.


Also Read: Corona Nasal Vaccine: నాసల్ వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు, ఆశలు రేపుతున్న నాసల్ స్ప్రే వ్యాక్సిన్



గడిచిన 24 గంటల్లో 40,026 మంది కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ దేశంలో కరోనా(Covid-19)ను జయించిన వారి సంఖ్య 3,01,83,876 (3 కోట్ల 1 లక్షా 83 వేల 876)కు చేరింది. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 4,30,422 (4 లక్షల 30 వేల 422)కు చేరుకున్నాయి. నిన్న ఒక్కరోజులో 38 లక్షల 78 వేల 78 మంది కోవిడ్19 టీకాలు తీసుకున్నారు. మొత్తంగా 39,53,43,767 (39 కోట్ల 53 లక్షల 43 వేల 767) డోసుల కరోనా టీకాలు ప్రజలు తీసుకున్నారని బులెటిన్‌లో తెలిపారు. 


Also Read: Covaxin Emergency Use: కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి WHO త్వరలోనే అనుమతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook