Vaccination For Children: 12 నుంచి 18 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సినేషన్‌పై శుభవార్త, Zydus Vaccine రెడీ

COVID-19 Vaccination for 12 to 18 year In India: కరోనా థర్డ్ వేవ్ త్వరలోనే వస్తుందని నిపుణులు పేర్కొన్న నేపథ్యంలో టీనేజ్ వయసు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ సాధ్యమైనంత త్వరగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కసర్తతు చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2021, 04:38 PM IST
Vaccination For Children: 12 నుంచి 18 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సినేషన్‌పై శుభవార్త, Zydus Vaccine రెడీ

Vaccination for children 12 to 18 year In Indi: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది, కానీ డెల్టా మరియు డెల్టా ప్లస్ వేరియంగ్ కేసులు నిత్యం నమోదువుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ త్వరలోనే వస్తుందని నిపుణులు పేర్కొన్న నేపథ్యంలో టీనేజ్ వయసు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ సాధ్యమైనంత త్వరగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కసర్తతు చేస్తోంది.

భారత్‌లో 12 నుంచి 18 ఏళ్ల వారికి సెప్టెంబర్ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు వ్యాక్సిన్ నిర్వహణ నిపుణుడు ఎన్‌కే ఆరోరా తెలిపారు. జైడస్ క్యాడిలా కంపెనీకి చెందిన (Zycov D First children vaccine) వ్యాక్సిన్‌ టీనేజర్లకు భారత్‌లో తొలి టీకా కానుందన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాక్సిన్ల జాతీయ నిపుణుల కమిటీ చీఫ్ ఎన్‌కే అరోరా పలు విషయాలు ప్రస్తావించారు. భారత్ బయోటెక్ తీసుకొస్తున్న కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాగానే ఆ టీకా పంపిణీ సైతం ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం జైడస్ టీకా క్లినికల్ ట్రయల్స్ త్వరలో రానున్నాయని, వాటి ఫలితాలు పరిశీలించిన అనంతరం వ్యాక్సినేషన్ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు.

Also Read: India Corona Cases: ఇండియాలో మళ్లీ పెరిగిన కోవిడ్19 మరణాలు, వ్యాక్సినేషన్ వేగవంతం

భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్ (Bharat Biotech Covaxin) ఫేజ్ 3 ట్రయల్స్ సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభం అవుతాయనని చెప్పారు. వీటి ఫలితాలు వెల్లడై, కోవాగ్జిన్ సామర్థ్యంపై నిర్ధారణకు వస్తే వచ్చే ఏడాది జనవరి నుంచి 12 నుంచి 18 ఏళ్ల వారికి ఈ టీకా పంపిణీ ప్రారంభిస్తామన్నారు. కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందని ఆందోళన నెలకొన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా వారికి జైడస్ టీకాలు పంపిణీ చేపడతామని స్పష్టం చేశారు. చిన్నారులపై థర్డ్ వేవ్ ప్రభావంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. 

మరోవైపు గత ఏడాది పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, కాలేజీలు తెరిచి సాధ్యమైనంత త్వరగా సిలబస్ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఆన్‌లైన్ తరగతులకు కొన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకోగా, మరికొన్ని రాష్ట్రాలు భౌతికదూరంతో క్లాసుల నిర్వహణ దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 736 జిల్లాల్లో చిన్న పిల్లల కేంద్రాలలో 20,000 ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉంచాలని నూతన ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ దిశగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Also Read: 7th Pay Commission Latest News: డీఏ పెంపునకు ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 5 కీలక నిర్ణయాలు ఇవే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News