India Corona Update: దేశంలో కరోనా సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్రమణ పెరుగుతున్న నేపధ్యంలో థర్డ్‌వేవ్ భయాందోళనలు నెలకొంటున్నాయి. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి తగ్గినా..కేసుల సంఖ్య మాత్రం క్రమంగా కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసుల సంఖ్యలో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా సంక్రమణ పెరుగుతుండటంతో కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave) భయాందళన నెలకొంది. ఈ నేపధ్యంలో కోవిడ్ ప్రోటోకాల్స్ కచ్చితంగా పాటించేవిధంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తోంది.


గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 33 వేల 376 కేసులు నమోదయ్యాయి. నిన్నమాత్రం ఏకంగా 46 వేల కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 కోట్ల 32 లక్షల 8 వేల 330కు చేరుకోగా..గత 24 గంటల్లో 308 మంది కోవిడ్ కారణంగా మరణించారు. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4 లక్షల 42 వేల 317కు పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మిజోరాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సోం రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కేరళలో అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 4 లక్షల వరకూ కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 32 వేల 198 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకూ 3 కోట్ల 23 లక్షల 74 వేల 497 మంది కోలుకున్నారు. ఇక కోవిడ్ రికవరీ రేటు దేశంలో 97.49 శాతంగా ఉంది. మరణాల రేటు 1.33 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 54 కోట్ల 1 లక్షా 96 వేల 989 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests)నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు నమోదవుతున్న దేశాల్లో ఇండియా మూడవ స్థానంలో నిలవగా..కొత్త కరోనా కేసుల విషయంలో రెండవ స్థానంలో నిలిచింది.


Also read: 9/11 Attacks: 9/11 దాడులకు సరిగ్గా 20 ఏళ్లు..ఆ రోజు అసలేం జరిగింది, ఎలా జరిగింది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook