India Covid-19 cases: ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు వరుసగా రెండోరోజు పెరిగాయి. మరోవైపు కోవిడ్-19 మరణాలు తక్కువగా నమోదు కావడం స్వల్ప ఊరటనిస్తోంది. దేశంలో కరోనా రికవరీ రేటు 97.28 శాతానికి చేరుకుంది. అప్రమత్తంగా లేకపోతే కరోనా థర్డ్ వేవ్ త్వరగా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. జికా వైరస్ ముప్పు పొంచి ఉన్నందున పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా రికవరీ కేసుల కంటే తాజాగా పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయి. జులై 15 ఉదయం  8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 41,806 మంది కరోనా (CoronaVirus Cases In India) బారిన పడ్డారు. తాజా కేసులతో కలిపితే దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,87,880 (3 కోట్ల 9 లక్షల 87 వేల 880)కు చేరుకుంది. నిన్నటితో పోల్చితే కోవిడ్19 మరణాలు స్వల్పంగా తగ్గాయి. కరోనా మహమ్మారితో పోరాడుతూ దేశంలో మరో 581 మంది చనిపోగా, ఇండియాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,11,989 (4 లక్షల 11 వేల 989) అయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


Also Read: Coffee Benefits: ప్రతిరోజూ కాఫీ తాగుతున్నారా, అయితే కోవిడ్-19 గురించి ఇది తెలుసుకోండి


గడిచిన 24 గంటల్లో 39,130 మంది కోవిడ్19 (COVID-19 Delta Variant) బారి నుంచి కోలుకోగా, దేశంలో ఇప్పటివరకూ 3,01,43,850 (3 కోట్ల 1 లక్షా 43 వేల 850) మంది కరోనా మహమ్మారిని జయించారు. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు మరోసారి పెరిగాయి. నిన్న 4 లక్షల 11 వేల 408 యాక్టివ్ కేసులుండగా, నేడు 4 లక్షల 11 వేల 989 అయ్యాయి. 


Also Read: Ganga Declared Covid-19 Free: గంగా నదిలో కరోనా వైరస్ లేదు, శాస్త్రవేత్తలకు అంతుచిక్కని విషయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook