Covid-19 updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ 90వేలకు పైగా కేసులు, వేయికి పైగా మరణాలు నమోదవుతునే ఉన్నాయి. అయితే గత 24గంటల్లో మళ్లీ రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. గత 24గంటల్లో శుక్రవారం ( సెప్టెంబరు 18న ) దేశవ్యాప్తంగా (India) కొత్తగా.. 93,337 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 1,247 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,08,015 కి పెరగగా.. మరణాల సంఖ్య 85,619 కి చేరింది. ఈ మేరకు శనివారం ఉదయం కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,13,964 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 42,08,432 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. Also read: Air India: దుబాయ్‌కు యథావిధిగా విమాన సర్వీసులు


ఇదిలాఉంటే.. శుక్రవారం దేశవ్యాప్తంగా 8,81,911 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 18 వరకు మొత్తం 6,24,54,254 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.  Also read: Urmila Matondkar: కంగనా అడల్ట్ స్టార్ కామెంట్‌పై ఊర్మిళ ట్వీట్