India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80వేల నుంచి లక్షకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఇదిలాఉంటే.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు చేసిన సంఖ్య 7కోట్లు దాటింది. అయితే గత 24గంటల్లో శుక్రవారం ( సెప్టెంబరు 25న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 85,362 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 1,089 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,03,933 కి చేరగా.. మరణాల సంఖ్య 93,379 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,60,969 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 48,49,585 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. Also read: Durgam Cheruvu Cable Bridge: భాగ్యనగరానికి మరో మణిహారం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏడుకోట్లు దాటిన టెస్టులు..


ఇదిలాఉంటే.. శుక్రవారం దేశవ్యాప్తంగా 13,41,535 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 25 వరకు మొత్తం 7,02,69,975 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో దేశంలో కరోనా రికవరి రేటు 82.14 శాతం ఉండగా.. మరణాల రేటు 1.58 శాతం ఉంది. Also read: AP ICET-2020 ఫలితాలు విడుదల.. 78శాతం మంది ఉత్తీర్ణత