Coronavirus updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో ( India ) కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే తాజాగా 45వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రోజూ నమోదయ్యే కేసులకన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం గణనీయంగానే పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో శనివారం ( నవంబరు 7న ) దేశవ్యాప్తంగా కొత్తగా.. 45,674 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 559 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Haj 2021: హజ్ యాత్రకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,07,754 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,26,121 కి చేరింది. అయితే.. శనివారం కరోనాతో 49,082 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 78,68,968 కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 5,12,665 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 92.49 శాతం ఉండగా.. మరణాల రేటు 1.48 శాతం ఉంది. Also read: Joe Biden: అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటా: జో బిడెన్


ఇదిలాఉంటే.. శనివారం దేశవ్యాప్తంగా 11,94,487 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి నవంబరు 7 వరకు దేశంలో మొత్తం 11,77,36,791 నమూనాలను పరీక్షించినట్లు ఎసీఎంఆర్ వెల్లడించింది.


Also read: US Elections: జో బిడెన్, కమలా హారిస్‌కు.. రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe