India Covid 19 Cases Updates: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9520 కరోనాకేసులు నమోదయ్యాయి. మరో 41 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,43,98,696కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 5,27,597కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 87,311గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 0.20 శాతంగా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్నటి కన్నా ఇవాళ 3396 యాక్టివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి.ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 2.50 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.80 శాతంగా ఉంది. ఇప్పటివరకూ 4,37,83,788 కరోనా రికవరీలు నమోదయ్యాయి.


దేశంలో ఇప్పటివరకూ 211.91 కోట్ల వ్యాక్సిన్లు వేశారు. వ్యాక్సినేషన్‌లో ఈ ఏడాది జూలైలో భారత్ 200 కోట్ల మైలురాయిని చేరింది. జనవరి 21, 2021న దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమవగా.. ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలో 200 కోట్ల వ్యాక్సినేషన్ మైల్ స్టోన్‌ని చేరిన రెండో దేశంగా భారత్ నిలిచింది.


కేసుల విషయానికొస్తే.. ఆగస్టు 7, 2020న భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 20 లక్షల మార్క్‌ని చేరింది. అదే ఏడాది డిసెంబర్ 19 నాటికి కేసుల సంఖ్య 1 కోటి మార్క్‌ను చేరింది. మే 4, 2021 నాటికి 2 కోట్లు, జూన్ 23, 2021 నాటికి 3 కోట్లు, ఈ ఏడాది జూన్ 25 నాటికి 4 కోట్ల మార్క్‌ను దాటింది. 


Also Read : Oppo K10 Smartphone: రూ.14990 విలువ చేసే ఒప్పో కే10 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.599కే... ఆఫర్ రేపటితో లాస్ట్.. 


Also Read: Gross, Net and Share Collections: గ్రాస్, నెట్, షేర్ వసూళ్లకు తేడా ఏంటో తెలుసా?



లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook