Oppo K10 Smartphone: రూ.14990 విలువ చేసే ఒప్పో కే10 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.599కే... ఆఫర్ రేపటితో లాస్ట్..

Oppo K10 Smartphone : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ సేల్‌లో ఒప్పో కే10 స్మార్ట్ ఫోన్‌ డెడ్ చీప్ ధరకే అందుబాటులో ఉంది.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 27, 2022, 11:20 AM IST
  • అతి చౌక ధరకు ఒప్పో కే10 స్మార్ట్ ఫోన్
  • రూ.14990 విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం రూ.599కే
  • ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ అందిస్తున్న ఆఫర్ వివరాలివే
Oppo K10 Smartphone: రూ.14990 విలువ చేసే ఒప్పో కే10 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.599కే... ఆఫర్ రేపటితో లాస్ట్..

Oppo K10 Smartphone : ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 'బిగ్ బచత్ ధమాల్' సేల్ నడుస్తోంది. ఈ ఆఫర్ కింద రూ.99 విలువ చేసే వస్తువులు మొదలు రూ.1 లక్ష విలువ చేసే వస్తువుల వరకు బిగ్ డిస్కౌంట్స్‌తో లభిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌లో స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు తదితర వస్తువులపై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుంటే డెడ్ చీప్ ధరకే మీ ఫేవరెట్ బ్రాండ్స్‌ను సొంతం చేసుకోవచ్చు. అలా డెడ్ చీప్ ధరకే అందుబాటులో ఉన్న ఒప్పో కే10 (6జీబీ, 128జీబీ) స్మార్ట్ ఫోన్ ఆఫర్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రిటైల్ స్టోర్స్‌లో ఒప్పో కే10 (6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ) స్మార్ట్ ఫోన్ ధర రూ.18,999గా ఉంది. కానీ ఫ్లిప్‌కార్ట్ 21 శాతం డిస్కౌంట్‌తో రూ.14,990కే ఈ స్మార్ట్ ఫోన్‌ని అందిస్తోంది. అంటే.. డిస్కౌంట్ ఆఫర్ ద్వారా రూ.4009 వరకు కస్టమర్స్‌కు ఆదా అవుతుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు పలు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్‌ కార్డులు ఉపయోగించినట్లయితే అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. తద్వారా ఒప్పో కే10 స్మార్ట్ ఫోన్‌ని మరింత చౌక ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో కే10 (6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ) స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా దాని కండిషన్‌ని బట్టి గరిష్ఠంగా రూ.14,400 వరకు తగ్గింపు పొందవచ్చు. ఒకవేళ పూర్తి ఎక్స్‌చేంజ్ ఆఫర్ లభించినట్లయితే రూ.14,990కి అందుబాటులో ఉన్న ఒప్పో కే 10 స్మార్ట్ ఫోన్‌ని కేవలం రూ.599కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. బిగ్ బచత్ ధమాల్ సేల్ రేపటితో ముగియనుంది.

ఒప్పో కే10 స్మార్ట్ ఫోన్‌ ఫీచర్స్ : 

6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ
6.59 ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
50MP + 2MP + 2MP బ్యాక్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా సెటప్
5000 mAh బ్యాటరీ
క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ 
ఏఐ ఫోటో సూట్ 

 

Also Read: Chiranjeevi: రెండు, మూడు రోజుల్లో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి చిరంజీవి... కారణమిదే..  

Also Read: Girls Fight Over Boyfriend: బస్టాండ్‌లో రచ్చ... అందరూ చూస్తుండగా బాయ్‌ఫ్రెండ్ కోసం కొట్టుకున్న బాలికలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News