India Covid-19 Death Toll: ఇండియాలో 4 లక్షలు దాటిన కోవిడ్19 మరణాలు
India covid Death toll reaches 4 lakhs:మే నుంచి దాదాపు నెల రోజులపాటు పాలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా కట్టడి చర్యలలో భాగంగా లాక్‌డౌన్, కర్ఫ్యూలు విధించడంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.
India covid-19 Death Toll: ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు ఇటీవల 3 కోట్లు దాటాయి. తాజాగా కరోనా మరణాలు 4 లక్షలకు చేరుకున్నాయి. మే నుంచి దాదాపు నెల రోజులపాటు పాలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా కట్టడి చర్యలలో భాగంగా లాక్‌డౌన్, కర్ఫ్యూలు విధించడంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.
ఇండియాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 46,617 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే దేశంలో మొత్తం కరోనా వైరస్ (CoronaVirus) బాధితుల సంఖ్య 3,04,58,251కు (3 కోట్ల 4 లక్షల 58 వేల 251)కు చేరుకుంది. నిన్నటితో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు, కోవిడ్19 మరణాలు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 853 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 4 లక్షలు దాటింది. ఇప్పటివరకూ 4 లక్షల 312 మంది (4 లక్షల 312) మందిని కరోనా మహమ్మారి బలిగొంది.
Also Read: Delta Plus Variant: డెల్టా ప్లస్ వేరియంట్‌పై ఆందోళన చెందవద్దు, మరింత సమాచారం వస్తేనే స్పష్టత
గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 59,384 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. కాగా, గత ఏడాది నుంచి ఇప్పటివరకూ 2,95,48,302 (2 కోట్ల 95 లక్షల 48 వేల 302) మంది కోవిడ్19 (Covid-19) మహమ్మారిని జయించారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 5,09,637 (5 లక్షల 9 వేల 637) యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇండియాలో కరోనా రికవరీ రేటు 97.01 శాతానికి చేరుకుంది. డెల్టా, డెల్టా ప్లస్ కరోనా వేరియంట్లపై పూర్తి స్థాయిలో సమాచారం లేదని, వాటి గురించి ఆందోళన చెందరాదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఇటీవల పేర్కొన్నారు.
Also Read: Covaxin: ఆ రెండు Covid-19 వేరియంట్లపై కోవాగ్జిన్ మెరుగైన ఫలితాలు, అధ్యయనంలో వెల్లడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook