India Covid: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో  కొత్తగా 2259 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోల్చితే 105 కేసులు తక్కువగా నమోదయ్యాయి. దీంతో దేశంలో ప్రస్తుతం 15 వేల 044 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 2614 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా నుంచి రికవరీ అయినవారి సంఖ్య 4 కోట్ల 25 లక్షల 92 వేల 455కి చేరింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. యాక్టివ్‌ కేసుల శాతం 0.03 గా నమోదైంది. అటు రోజువారీ పాజిటివిటీ రేటు 0.50 శాతంగా ఉండగా.. వారంతపు పాజిటివిటీ రేటు 0.53 శాతంగా రికార్డైంది.  ఇప్పటివరకు 84 కోట్ల 58 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. గడిచిన 24 గంటల్లో 4 లక్షల 51వేల 179 మందికి ఈ పరీక్షలు నిర్వహించారు. అటు దేశంలో 191 కోట్ల 96 లక్షల వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రాలకు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.


Also Read: Davos Meeting: దావోస్ భేటీకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏ అంశాలపై ఫోకస్ ?


Also Read: Dead Body In MLC Car: వైసీపీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం.. కొట్టి చంపారనే ఆరోపణలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook