Davos Meeting: దావోస్ భేటీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏ అంశాలపై ఫోకస్ ?

Davos Meeting: వరల్డ్ ఎకనామిక్స్ ఫోరమ్ ప్రతియేటా దావోస్‌లో జరిగే ప్రతిష్టాత్మక వేదిక. దావోస్ సమావేశాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడులపై చర్చించనున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 20, 2022, 03:48 PM IST
  • దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలకు బయలుదేరిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
  • రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల అవకాశాల్ని సమావేశంలో వివరించనున్న వైఎస్ జగన్
  • రాష్ట్రంలో పారిశ్రామిక అవకాశాల్ని వివరించేలా ఏపీ పెవిలియన్ ఏర్పాటు
Davos Meeting: దావోస్ భేటీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏ అంశాలపై ఫోకస్ ?

Davos Meeting: వరల్డ్ ఎకనామిక్స్ ఫోరమ్ ప్రతియేటా దావోస్‌లో జరిగే ప్రతిష్టాత్మక వేదిక. దావోస్ సమావేశాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడులపై చర్చించనున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. విజయవాడ విమానాశ్రయం నుంచి దావోస్‌కు బయలుదేరారు. రాత్రికి వైఎస్ జగన్ దావోస్ చేరుకోనున్నారు. ఈ నెల 22వ తేదీన దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. ఈ సదస్సు మే 22 నుంచి 26వ తేదీ వరకూ ఐదురోజులు జరగనుంది.

ఏపీలో పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్..రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల్ని వివరించనున్నారు. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, కొత్తగా చేపట్టిన మూడు ఎయిర్ పోర్టులు ఎలా దోహదపడనున్నాయో వివరిస్తారు. అదే సమయంలో బెంగళూరు-హైదరాబాద్, చెన్నై-బెంగళూరు, విశాఖపట్నం-చెన్నై కారిడార్లలో పెట్టుబడి అవకాశాల్ని వివిధ పారిశ్రామిక సంస్థల ముందుంచనున్నారు.

ఇంటర్ కనెక్టివిటీ, రియల్ టైమ్ డేటా, యాంత్రీకరణ, ఆటోమేషన్‌లకు పారిశ్రామికీకరణలో స్థానం కల్పించాలనేది ఏపీ ప్రభుత్వ ఉద్దేశ్యం. అందుకే దావోస్ సదస్సులో ఏపీ పెవిలియన్ కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పీపుల్ ప్రోగ్రెసివ్ పాజిబిలిటీస్ పేరుతో ఈ పెవిలియన్ నిర్వహించనుంది.

Also read: Dead Body In MLC Car: వైసీపీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం.. కొట్టి చంపారనే ఆరోపణలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook 

Trending News