India Covid 19 Cases: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 13,272 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌తో మరో 36 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,43,27,890కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 5,27,289కి చేరింది.  నిన్నటితో పోలిస్తే ఇవాళ 2482 కేసులు తక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,01,166గా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్నటితో పోలిస్తే యాక్టివ్ కేసులు కూడా తగ్గాయి. నిన్నటి కన్నా 664 కేసులు తక్కువగా నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 0.23 శాతంగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 13,900 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో కోవిడ్ రికవరీల సంఖ్య 4,36,99,435కి చేరింది. ప్రస్తుతం కోవిడ్ రికవరీ రేటు జాతీయ స్థాయిలో 98.58 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 4.21 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 3.87 శాతం ఉంది.


గడిచిన 24 గంటల్లో 3,15,231 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకూ నిర్వహించిన కోవిడ్ టెస్టుల సంఖ్య 88,21,88,283కి చేరింది. ఇక ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 209.40 కోట్ల వ్యాక్సిన్లు వేశారు.  ఈ ఏడాది జూలైలో భారత్ 200 కోట్ల వ్యాక్సిన్ మార్క్ అందుకున్న సంగతి తెలిసిందే. జనవరి 21, 2021న కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమవగా 9 నెలల్లోనే 100 కోట్ల మార్క్‌ను చేరింది. గతేడాది అక్టోబర్‌లో 150 కోట్ల మార్క్‌ను ఈ ఏడాది జూలైలో 200 కోట్ల మార్క్‌ను అందుకుంది. 


Also Read: Munugode Bypoll Live Updates: అటు కేసీఆర్ సభ.. ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్ర.. రేపు అమిత్ షా.. అగ్రనేతల టూర్లతో హీటెక్కిన మునుగోడు  


Also Read: Undavalli Sridevi: తాడికొండ వైసీపీలో రచ్చ.. అర్ధరాత్రి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నిరసన.. అధిష్ఠానానికి 10 గం. డెడ్‌ లైన్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook