Undavalli Sridevi: తాడికొండ వైసీపీలో రచ్చ.. అర్ధరాత్రి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నిరసన.. అధిష్ఠానానికి 10 గం. డెడ్‌ లైన్..

Undavalli Sridevi Midnight Protest: తాడికొండ వైసీపీలో రచ్చ జరుగుతోంది. నియోజకవర్గానికి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను అదనపు ఇన్‌ఛార్జిగా నియమించడంతో స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భగ్గుమంటున్నారు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 20, 2022, 10:16 AM IST
  • తాడికొండ వైసీపీలో రచ్చ
    అదనపు ఇన్‌ఛార్జిగా డొక్కా నియామకంతో ఎమ్మెల్యే శ్రీదేవి ఆగ్రహం
    అర్ధరాత్రి మేకతోటి సుచరిత ఇంటి వద్ద నిరసన
Undavalli Sridevi: తాడికొండ వైసీపీలో రచ్చ.. అర్ధరాత్రి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నిరసన.. అధిష్ఠానానికి 10 గం. డెడ్‌ లైన్..

Undavalli Sridevi Midnight Protest: గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి.  నియోజకవర్గంలో అదనపు ఇన్‌ఛార్జిగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించడాన్ని స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే ఉండగా మరొకరిని సమన్వయకర్తగా నియమించడం తనను అవమానించడమేనని శ్రీదేవి ఫైర్ అవుతున్నారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి వద్ద శుక్రవారం అర్ధరాత్రి అనుచరులతో కలిసి నిరసనకు దిగారు.

పార్టీ అధిష్ఠానంతో మాట్లాడి చూద్దామని మేకతోటి సుచరిత నచ్చజెప్పడంతో ఎమ్మెల్యే శ్రీదేవి వెనక్కి తగ్గారు. ఆందోళన విరమించుకున్నప్పటికీ ఉండవల్లి శ్రీదేవి వర్గం పార్టీ అధిష్ఠానానికి 10 గంటల డెడ్‌ లైన్ విధించింది. ఆలోగా డొక్కా మాణిక్యవరప్రసాద్ నియామకంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం మార్చుకోకపోతే తాడికొండ పరిధిలోని నాలుగు మండలాల నాయకులు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై పార్టీ అధిష్ఠానంతో నేరుగా మాట్లాడేందుకు తాడికొండ నేతలు ప్రయత్నిస్తున్నారు.

డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను అదనపు సమన్వయకర్తగా నియమించడంతో సొంత పార్టీలోనే తనకు పోటీ ఏర్పడిందని శ్రీదేవి భావిస్తున్నారు. తనకు చెక్ పెట్టేందుకే డొక్కాకు ఆ పదవి ఇచ్చారని భావిస్తున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున డొక్కా మాణిక్యవరప్రసాద్ రెండుసార్లు గెలిచారు. ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇటీవలే మండలి విప్‌గా ఆయనకు ప్రమోషన్ కూడా ఇచ్చింది అధిష్ఠానం. ఉండవల్లి శ్రీదేవిపై పార్టీ అధిష్ఠానం అసంతృప్తితో ఉండటం వల్లే డొక్కాకు ప్రాధాన్యం పెంచారని, అందుకే తాడికొండలో ఆయన్ను అదనపు ఇన్‌ఛార్జిగా నియమించినట్లు చెబుతున్నారు. 

నిజానికి తాడికొండ నియోజకవర్గంలో చాలాకాలంగా అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. ఉండవల్లి శ్రీదేవి ఒంటెద్దు పోకడలు పోతున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు గతంలో ఆరోపించారు. గడపగడపకు వంటి కార్యక్రమాలకు అసలు తమను ఆహ్వానించకపోవడంపై శ్రీదేవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో పేకాట క్లబ్ వ్యవహారం కూడా శ్రీదేవిపై అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించింది. మరోవైపు, ఎంపీ నందిగం సురేషే తనకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని ఎగదోస్తున్నారని శ్రీదేవి భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీ అధిష్ఠానం అదనపు సమన్వయకర్తను నియమించడం ఇక శ్రీదేవికి చెక్ పెట్టినట్లేననే వాదన వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆమెకు చెక్ పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది.

Also Read:KCR Munugode Meeting Live Updates: 4 వేల కార్లతో సీఎం కేసీఆర్ కాన్వాయ్.. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో?

Also Read: Manjunatha Reddy Death: సంచలనం రేకెత్తిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అల్లుడి అనుమానాస్పద మృతి... ఏం జరిగి ఉంటుంది..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News