COVID19: భారత్‌లో 14 లక్షలకు చేరిన కరోనా బాధితులు
CoronaVirus Positive Cases India| కరోనా వైరస్‌తో పోరాడుతున్న దేశాలలో భారత్ ఒకటి. అత్యధిక కేసులు, మరణాలలో తొలి 5 దేశాలలో భారత్ నిలవడం ఆందోళన రేకెత్తిస్తోంది.
భారత్‌లో కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలతో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 49,931 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 708 మంది కోవిడ్19 బారిన పడి మరణించారు. అయితే ఒక్కరోజులో నమోదైన కేసులలో తాజాగా నమోదైన కేసులే అత్యధికం. భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య (COVID19 Cases In India)14,35,453కు చేరింది. Nithin Wedding Photos: హీరో నితిన్, షాలినిల పెళ్లి వేడుక ఫొటోలు
దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం కరోనా మరణాల సంఖ్య 32,771కు చేరింది. భారత్‌లో మొత్తం కరోనా కేసులకుగానూ చికిత్స అనంతరం 9,17,568 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,85,114 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. ‘రెమ్‌డెసివర్’ అక్కడ మాత్రమే విక్రయాలు
కాగా, భారత్‌లో ఇప్పటివరకూ 1,68,06,803 (1.68 కోట్లు) శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. కేవలం గత 24 గంటల్లోనే 5,15,472 కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్