COVID-19 tests conducted per day Nearly 9 lakh tests: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ( Coronavirus ) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం 50వేలకు పైగా కోవిడ్-19 కేసులు, దాదాపు వేయికి దగ్గరగా మరణాలు సంభవిస్తునే ఉన్నాయి. అయితే.. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా భారత ప్రభుత్వం ( Govt of India )  కరోనా టెస్టులను కూడా పెంచింది. దీంతో కరోనా టెస్టుల పరంగా భారత్ మరో రికార్డును సాధించింది. కేవలం ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా దాదాపు 9లక్షల నమూనాలను పరీక్షించి ఈ ఘనతను సాధించింది. నిన్న ఒక్కరోజే 8,99,864 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఒక్క రోజులో ఇన్ని నమూనాలను పరీక్షించడం ఇదే మొదటిసారి. అయితే.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,09,41,264 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. Also read: Vande Bharat Mission: ఎయిరిండియా విమానాలపై నిషేధం


దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,02,743కు చేరుకోగా.. మరణాల సంఖ్య 51,797కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 6,73,166 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివకు 19,77,780 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. Also read: India: 27 లక్షలు దాటిన కరోనా కేసులు