India COVID-19 Cases: ఇండియాలో 60 వేల దిగువకు కరోనా పాజిటివ్ కేసులు
India new COVID19 cases: కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ సడలింపు నిర్ణయాలు తీసుకోగా, మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్ వేళలను సడలిస్తున్నాయి. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ గురించి హెచ్చరికలు మొదలయ్యాయి.
India new COVID19 cases: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో పలు రాష్ట్రాలు నష్టనివారణ చర్యలు ప్రారంభించాయి. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ సడలింపు నిర్ణయాలు తీసుకోగా, మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్ వేళలను సడలిస్తున్నాయి. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ గురించి హెచ్చరికలు మొదలయ్యాయి.
ఇండియాలో తాజాగా 58,419 మంది కరోనా బారిన పడ్డారు. తాజా కేసులతో కలిపితే దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2,98,81,965 (2 కోట్ల 98 లక్షల 81 వేల 965)కు చేరుకుంది. గత 81 రోజులలో 50 వేల దిగువగా కరోనా కనిష్ట కేసులు తాజాగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల సమయంలో దేశంలో 1,576 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనాతో పోరాడుతూ చనిపోయిన వారి సంఖ్య 3,86,713 (3 లక్షల 86 వేల 713)కు చేరుకుంది.
Also Read: Foods To Eat During Covid-19: కరోనా నుంచి త్వరగా కోలుకునేందుకు ఈ ఆహారం తీసుకోండి
శనివారం నాడు దేశవ్యాప్తంగా 87,619 మంది కరోనా మహమ్మారిని జయించగా, ఇప్పటివరకూ భారత్‌లో కోవిడ్19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,87,66,009 (2 కోట్ల 87 లక్షల 66 వేల 9)కు చేరింది. కరోనా రికవరీ రేటు 96.27 శాతానికి చేరుకోగా, వీక్లి పాజిటివ్ రేటు 5 శాతానికి దిగువన ఉన్నట్లు తెలిపారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 3.22 శాతానికి దిగొచ్చింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: Delta Plus Variant of COVID-19: డెల్టా ప్లస్ వేరియంట్ నిజమే, B.1.617.2.1పై స్పందించిన కేంద్రం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook