Delta Plus Variant of COVID-19: డెల్టా ప్లస్ వేరియంట్ నిజమే, B.1.617.2.1పై స్పందించిన కేంద్రం

Is Delta Plus Variant of COVID-19 is a Concern: తొలిసారిగా ఇండియాలోనే గుర్తించిన డెల్టా వేరియంట్ మ్యుటేషన్ అయిన తరువాత డెల్టా ప్లస్ అని కొత్త వేరియంట్‌గా మారింది. కరోనా కేసులు తగ్గుతున్నాయిని భావిస్తున్న నేపథ్యంలో కొత్త వేరియంట్ B.1.617.2.1 పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 16, 2021, 06:54 PM IST
  • భారత్‌లో వేగంగా కరోనా వ్యాప్తి చెందడానికి కారణం డెల్టా వేరియంట్
  • తాజాగా డెల్టా ఉత్పరివర్తనం చెంది డెల్టా ప్లస్ వేరియంట్‌ పుట్టుకొచ్చింది
  • డెల్టా ప్లస్ కేసులు నిజమేనని, దాని ప్రభావం త్వరలో తెలుస్తుందన్న కేంద్రం
Delta Plus Variant of COVID-19: డెల్టా ప్లస్ వేరియంట్ నిజమే, B.1.617.2.1పై స్పందించిన కేంద్రం

Delta Plus Variant of COVID-19: కరోనా వైరస్‌ను వేగంగా వ్యాప్తి చేసే SARS-CoV-2 వేరియంట్ మరోసారి ఉత్పరివర్తనం చెందింది. తొలిసారిగా ఇండియాలోనే గుర్తించిన డెల్టా వేరియంట్ మ్యుటేషన్ అయిన తరువాత డెల్టా ప్లస్ అని కొత్త వేరియంట్‌గా మారింది. దేశంలో ఓవైపు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయిని భావిస్తున్న నేపథ్యంలో కొత్త వేరియంట్ పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది.

నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ దీనిపై స్పందించారు. డెల్టా వేరియంట్ నుంచి కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్ లేదా AY.1 variant పుట్టుకొచ్చిందని స్పష్టం చేశారు. అయితే ఇది ప్రమాదకరమైన వేరియంట్ (Delta Plus Variant Of COVID-19) అనే సంకేతాలు ఇప్పటివరకూ కనిపించలేదన్నారు. గత కొన్ని రోజులుగా కరోనా బాధితులలలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు గుర్తించడం నిజమేనని చెప్పారు. కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ప్రస్తుతానికి దీన్ని కేవలం కొత్త వేరియంట్‌గా మాత్రమే భావించాలని, ఇది ప్రమాదకరమైన కోవిడ్-19 వేరియంట్ అని సైతం చెప్పలేమన్నారు.

Also Read: India Corona Updates: స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, తగ్గిన Covid19 మరణాలు

డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభావం, అనంతరం వచ్చే మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. భారత్‌లోని కరోనా బాధితులతో పాటు విదేశాలలోని కోవిడ్19 (COVID-19) పేషెంట్లలోనూ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు గుర్తించినట్లు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. భారత్‌లోని SARS-CoV-2 కన్సార్టియం జెనోమిక్స్ (INSACOG) ద్వారా పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయని చెప్పారు. యూరప్, అమెరికా, ఆసియా దేశాలలో డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అక్కడా సైతం దీనిపై అధ్యయనం మొదలైంది. 

Also Read: Covaxin Vaccine: కోవాగ్జిన్ తీసుకున్నా ఓకే అంటున్న అమెరికా

B.1.617.1 మరియు B.1.617.2లను తొలిసారిగా ఇక్కడే గుర్తించినందున వీటిని భారత్ వేరియంట్స్ అని పిలుస్తారు. కొన్ని రోజుల కిందట ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటికి కప్పా మరియు డెల్టా అని నామకరణం చేసింది. డెల్టా వేరియంట్‌గా వ్యవహరించే ఈ B.1.617.2 ఉత్పరివర్తనం చెందడంతో B.1.617.2.1 లేదా డెల్టా ప్లస్ వేరియంట్ లేదా AY.1 variant పుట్టుకొచ్చింది. ప్రస్తుతానికి దీని ప్రభావం ఏమాత్రం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు.

Also Read: Delta Plus Variant Of COVID-19: ఇండియాలో కరోనా కొత్త వేరియంట్, దీని ప్రభావం వివరాలివే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News