Cyber Securities Index: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధిత రంగాల్లో ఇండియాదే పైచేయి అని మరోసారి నిరూపితమైంది. ఐటీలో అత్యంత కీలకంగా భావించే గ్లోబల్ సైబర్ సెక్యూరిటీస్‌లో ఇండియా టాప్‌టెన్‌లో నిలిచింది. శత్రుదేశాల్ని చాలా వెనక్కి నెట్టేయడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐటీ రంగం (IT Sector)ఎంతగా అభివృద్ధి చెందినా సైబర్ సెక్యూరిటీ అనేది చాలా కీలకం. సైబర్ సెక్యూరిటీ పటిష్టంగా ఉంటేనే ఐటీ రంగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది వివిధ దేశాల సామర్ధ్యాన్ని సూచిస్తుంది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ప్రతియేటా దీనికి సంబంధించిన జాబితా విడుదల చేస్తుంటుంది. చట్టపరమైన సాంకేతికత, సంస్థాగత చర్యలు, సామర్ధ్యం, అభివృద్ధి, సహకారం ఆధారంగా ఈ ఇండెక్స్ రూపుదిద్దుకుంటుంది.


ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ తాజాగా విడుదల చేసిన గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్‌(Global Cyber Security Index)లో టాప్‌టెన్‌లో నిలిచింది. ఇండియా ఈ సూచీలో పదవ స్థానం సాధించింది. 2019లో విడుదలైన జాబితాలో 47 వ స్థానంలో ఉన్న ఇండియా తాజా జాబితాలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఏకంగా 37 స్థానాల్ని మెరుగుపర్చుకుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో నాలుగవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో నిలవగా..యూకే రెండవ స్థానాన్ని సాధించింది. ఇండియా శత్రుదేశాలైన చైనా ఈ ఇండెక్స్‌లో 33 వ స్థానంలోనూ, పాకిస్తాన్ 79వ స్థానంలోనూ ఉండి..ఇండియా కంటే చాలా వెనుకబడి ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీస్‌లో ఇండియా..చైనా కంటే చాలా ముందు ఉండటం విశేషం.


Also read: EU Green Pass: దిగివచ్చిన యూరోపియన్ యూనియన్, గ్రీన్‌పాస్‌లో కోవిషీల్డ్‌కు అనుమతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook