corona cases in India rise again: దేశంలో ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,549 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (New Corona cases in India) తెలిసింది. మొత్తం 11,81,246 టెస్టులు చేయగా ఈ కేసులు బయపడ్డట్లు ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే సమయంలో కొవిడ్ కారణంగా మరో 488 మంది ప్రాణాలు (Corona deaths in India) కోల్పోయారు. 9,868 మంది కొవిడ్ నుంచి తేరుకున్నారు. 


మరిన్ని వివరాలు..


దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,10,133 యాక్టివ్ కరోనా కేసులు (Active Corona cases in India) ఉన్నాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,67,468 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్​ మరణాల రేటు 1.35 శాతంగా ఉంది.


ఇప్పటి వరకు దేశంలో 3,45,44,882 మందికి కరోనా సోకగా.. అందులో 3,39,67,962 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.33 శాతంగా ఉంది.


వ్యాక్సినేషన్ ఇలా..


నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 83,88,824 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,20,27,03,659 వద్దకు చేరింది.


ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..


ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 260,311,242 మందికికరోనా సోకింది. అందులో 5,199,470 మంది మహమ్మారికి బలయ్యారు. 235,255,925 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 19,855,847 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.


Also read: Delhi Metro’s driverless train : ఢిల్లీలో పింక్‌లైన్‌పై డ్రైవర్‌లెస్‌ మెట్రో పరుగులు


Also read: Teacher ends life : లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య.. అవమానం భరించలేక టీచర్‌ సూసైడ్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook