ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం కేంద్ర ప్రభుత్వానికి ఊరట కలిగిస్తోంది. మరోవైపు కోవిడ్19 వ్యాక్సినేషన్ కోసం విదేశాలు ఉత్పత్తి చేసిన స్పుత్నిక్ వి లాంటి టీకాలను అందుబాటులోకి తెస్తున్నారు. డీఆర్‌డీవో, డాక్టర్ రెడ్డీస్ రూపొందించిన 2డీజీ కరోనా ఔషధాన్ని సైతం ఇటీవల మార్కెట్లోకి విడుదల చేశారు. బ్యాక్ ఫంగస్ కేసులను సీరియస్‌గా తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో తాజాగా ఓరోజు వ్యవధిలో 1,14,460 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా నమోదైన కేసులతో కలిపితే దేశంలో ఇప్పటివరకూ కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 2,88,09,339 (2 కోట్ల 88 లక్షల 9 వేల 339)కు చేరుకుంది. కరోనా వైరస్ (CoronaVirus) పాజిటివ్ కేసులు వరుసగా 24వ రోజు తగ్గుముఖం పట్టడం గమనార్హం. కోవిడ్-19తో పోరాడుతూ మరో 2,677 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకూ మొత్తం 3,46,759 మందిని కరోనా బలితీసుకుంది.


Also Read: Free diagnostic tests: తెలంగాణలో ఇకపై ఉచితంగా ఖరీదైన వైద్య పరీక్షలు: CM KCR


దేశ వ్యాప్తంగా తాజాగా 1,89,232 (1 లక్షా 89 వేల 232) మంది కరోనా మహమ్మారిని జయించారు. ఇండియాలో ఇప్పటివరకూ మొత్తం 2,69,84,781 (2 కోట్ల 69 లక్షల 84 వేల 781) మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. భారత్‌లో కరోనా (Covid-19) రికవరీ రేటు 93.67 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. రోజువారీ కరోనా కేసుల పాజిటివిటీ రేటు 5.62 శాతానికి దిగొచ్చింది. దేశంలో ప్రస్తుతం 14,77,799 (14 లక్షల 77 వేల 799) యాక్టివ్ కేసులున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook