India Corona updates: దేశంలో కొవిడ్ కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వరుసగా మూడవ రోజు 18వేలకు పైగానే కొత్త కేసులు వచ్చాయి.  గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,840 మంది వైరస్ బారిన పడ్డారు. వైరస్ సోకి మరో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కొవిడ్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 5 లక్షల 25 వేల 386కు పెరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ప్రస్తుతం  ఐదు రాష్ట్రాల్లో కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. గత 24 గంటల్లో  కేరళలో  3 వేల 310 కొత్త కేసులు వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో 2 వేల 950, మహారాష్ట్రలో 2 వేల 944, తమిళనాడులో 2 వేల 722, కర్ణాటకలో  వెయ్యి 37 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదైన కొత్త కేసుల్లో  ఈ ఐదు రాష్ట్రాల నుంచే  68.81 శాతం కొత్త కేసులు వచ్చాయి. 


కరోనా నుంచి గత 24 గంటల్లో 16 వేల 104 మంది కోలుకున్నారు. దేశంలో మెుత్తం ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 4,29,53, 980గా ఉంది. దీంతో రికవరీ అయనవారి సంఖ్య 98.51 శాతంగా ఉంది. మెుత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు  సంఖ్య 0.29 శాతానికి పెరిగింది.  డైలీ పాజిటివిటీ రేటు 4. 14శాతంగా రికార్డు అయింది. దేశంలో యాక్టివ్ కేసులు లక్షా 25 వేలు దాటాయి. ప్రస్తుతం 1,25,028యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం స్థిరంగా కొనసాగుతుంది. శుక్రవారం 12,26,795 మందికి టీకాలు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,65,36,288గా నమోదైంది.  



Also Read: Horoscope Today July 9th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు..   


Also Read: Amarnath Cloudburst:15కు పెరిగిన అమర్ నాథ్ మృతులు... తృటిలో తప్పించున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్  



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook