Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వరుసగా మూడవ రోజు 20 వేలకు పైగానే కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా  20 వేల 044 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే కొవిడ్ మృతుల సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో కొవిడ్ సోకిన మరో 56 మంది చనిపోయారు. తాజా మృతులతో  దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 25 వేల 660కి పెరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో కొవిడ్ నుంచి మరో  18 వేల 301 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 40 వేలు దాటింది. దేశంలో రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.32 శాతానికి పెరిగింది. పాజిటివిట్ రేటు 4.48శాతంగా ఉంది. కొవిడ్ రోజువారి కొత్త కేసులు 20 వేలు దాటిపోవడం వైద్య శాఖ వర్గాలను కలవరపరుస్తోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న మరో 22 లక్షల 93 వేల 627మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు దేశంలో 199 కోట్ల 71 లక్షల 61 వేల 438మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. శనివారంతో దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ 200 కోట్ల మార్క్ కు క్రాస్ చేయనుంది.



Read also: Revanth Reddy: టీఆర్ఎస్, బీజేపీ కీలక నేతలకు రేవంత్ రెడ్డి గాలం! రాహుల్ సిరిసిల్ల సభలో సంచలనం?  


Read also: పిల్లలు 9 గంటలకే స్కూల్‌కు వెళ్తున్నారు.. మనమెందుకు 9 గంటలకే ప్రొసీడింగ్స్ ప్రారంభించలేం : సుప్రీం కోర్టు జస్టిస్ లలిత్


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.