India Corona Cases: కరోనా వ్యాక్సినేషన్లో మరో మైలురాయి, తాజాగా 2 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు
ఏప్రిల్ తర్వాత దాదాపు నెలన్నర రోజులకు ఓ రోజు వ్యవధిలో 2 లక్షల దిగువన పాజిటివ్ కేసులు వచ్చాయి. వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే కొత్త రకం వేరియంట్లతో పాటు ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు వైద్యులకు సవాల్‌గా మారుతున్నాయి.
ఏప్రిల్, మే తొలి వారంతో పోల్చితే భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఏప్రిల్ తర్వాత దాదాపు నెలన్నర రోజులకు ఓ రోజు వ్యవధిలో 2 లక్షల దిగువన పాజిటివ్ కేసులు వచ్చాయి. వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే కొత్త రకం వేరియంట్లతో పాటు ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు వైద్యులకు సవాల్‌గా మారుతున్నాయి.
భారత్‌లో గురువారం ఉదయం 8 వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,11,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,73,69,093 (2 కోట్ల 73 లక్షల 69 వేల 93)కు చేరుకుంది. కరోనా (CoronaVirus)తో పోరాడుతూ మరో 3,847 మంది చనిపోయారు. కోవిడ్19 బారిన పడి దేశంలో ఇప్పటివరకూ చనిపోయిన వారి సంఖ్య 3,15,235కి చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: COVID-19 Infections: కరోనా వ్యాక్సిన్ల ప్రభావంపై సర్వేలో సీడీసీ ఆసక్తికర విషయాలు
దేశంలో కరోనా వ్యాక్సిన్లలో మరో మైలురాయి చేరుకుంది. 20 కోట్ల వ్యాక్సిన్ (COVID-19 vaccine) డోసులు పంపిణీ పూర్తయింది. మే 26 వరకు 20,26,95,874 (20 కోట్ల 26 లక్షల 95 వేల 9 వందల 74) మందికి కరోనా టీకాలు ఇచ్చారు. నిన్న ఒక్కరోజు 2,83,135 మంది కరోనాను జయించగా, ఇప్పటివరకూ 2,46,33,951 మంది కోవిడ్19 బారి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 24,19,907 (24 లక్షల 19 వేల 907) యాక్టివ్ కరోనా కేసులున్నాయని తాజా బులెటిన్‌లో తెలిపారు.
Also Read: White Fungus Symptoms: సరికొత్త టెన్షన్ వైట్ ఫంగస్, Black Fungus కన్నా ప్రమాదకరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook