Covid 19 Cases: రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.. భారత్‌లో కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే!
India Reports 3157 new Coronavirus cases. కేసులు పడిపోయాయని సంతోషించేలోపే.. మహమ్మారి చాపకింద నీరులా నెమ్మదిగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. ఆదివారం 3,157 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
India Reports 3157 new Coronavirus cases in past 24 hours: ఈ ఏడాది ఆరంభంలో మూడో వేవ్ అనంతరం భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి దాదాపుగా అదుపులోకి వచ్చింది. దేశ ప్రజలందరూ వాక్సిన్ తీసుకోవడం చాలా హెల్ప్ అయింది. అయితే కరోనా కేసులు పడిపోయాయని సంతోషించేలోపే.. మహమ్మారి చాపకింద నీరులా నెమ్మదిగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. గత 4-5 రోజులుగా మూడు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం 3,157 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసుల్లో దేశ రాజధాని ఢిల్లీలోనే అత్యధికంగా ఉన్నాయి. ఢిల్లీలో ఆదివారం 1485 కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే దాదాపుగా సగం కేసులో అక్కడే రావడం విశేషం. దేశంలో మొత్తం కరోనా కేసులు 4,30,82,345కు చేరాయి. ఇందులో 4,25,38,976 మంది కోలుకోగా.. 19,500 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 5,23,869 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 26 మంది మరణించగా.. 2723 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
దేశంలో మొత్తం కేసుల్లో యాక్టివ్‌గా ఉన్నది 0.05 శాతం మాత్రమేనని ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. రికవరీ రేటు 98.74 శాతంగా.. మరణాల రేటు 1.22 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 1,89,23,98,347 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. ఆదివారం (మే 1) 4,02,170 మంది వ్యాక్సినేషన్ వేయించుకున్నారని కూడా పేర్కొంది. దేశంలో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Also Read: Vishwak Sen Prank: నడిరోడ్డుపై విశ్వక్ సేన్ రచ్చ.. సినిమా ప్రొమోషన్ కోసం ఇంత అరాచకమా!
Also Read: Ruturaj Gaikwad Record: బ్లాస్టింగ్ ఇన్నింగ్స్‌తో సచిన్ రికార్డును సమం చేసిన రుతురాజ్ గైక్వాడ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook