IPL CSK Vs SRH Ruturaj Gaikwad Innings: సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, కాన్వే అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. చెన్నై సమిష్టి కృషితో హైదరాబాద్‌పై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ కేవలం 57 బంతుల్లోనే 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 99 పరుగులు చేశాడు. తృటిలో సెంచరీ మిస్ అయిన గైక్వాడ్.. తాజా ఇన్నింగ్స్‌తో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూలర్క్ రికార్డును సమం చేశాడు.
ఐపీఎల్‌లో సచిన్ టెండూల్కర్ 31 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు సాధించగా... రుతురాజ్ గైక్వాడ్ కూడా 31 ఇన్సింగ్స్‌ల్లో ఆ ఫీట్‌ను సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన రికార్డు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మ్యాన్ షాన్ మార్ష్ పేరిట ఉంది. మార్ష్ కేవలం 21 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు.
సచిన్, రుతురాజ్ గైక్వాడ్ తర్వాత ఐపీఎల్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన ఇండియన్ బ్యాట్స్‌మెన్‌లో సురేష్ రైనా, దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్ ఉన్నారు. రైనా 34 ఇన్నింగ్స్‌తో ఈ ఫీట్ సాధించగా... పంత్, పడిక్కల్ 35 ఇన్నింగ్స్‌తో ఈ ఫీట్ సాధించారు.
ఇక నిన్నటి (మే 1) హైదరాబాద్-చెన్నై మ్యాచ్ విషయానికొస్తే... ధోనీ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రాత మారిపోయింది. తాజా ఐపీఎల్ సీజన్‌లో తొలిసారి ఛాంపియన్ తరహా ఆట కనబర్చింది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 202 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో హైదరాబాద్ 189 పరుగులకే పరిమితమైంది. దీంతో 13 పరుగుల తేడాతో చెన్నై ఈ మ్యాచ్‌లో గెలుపొందింది.
Also Read: Also Read: ప్రశాంత్ కిశోర్ బిగ్ అనౌన్స్‌మెంట్... సొంత రాజకీయ పార్టీపై నేడే ప్రకటన...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook