India COVID-19 Cases: భారత్‌లో వరుసగా రెండోరోజు తగ్గిన కరోనా కేసులు, ఫలితాన్నిస్తున్న LOckdown, నైట్ కర్ఫ్యూలు
India Corona Positive Cases : దేశ వ్యాప్తంగా సగానికి పైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ, పాక్షిక కర్ఫ్యూ అమలవుతోంది. లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలు ఫలితాన్ని్స్తున్నాయి. దేశంలో వరుసగా రెండో రోజు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.
India COVID-19 cases: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా సగానికి పైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ, పాక్షిక కర్ఫ్యూ అమలవుతోంది. లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలు ఫలితాన్ని్స్తున్నాయి. దేశంలో వరుసగా రెండో రోజు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 3,29,942 కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజా కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,29,92,517 (2 కోట్ల 29 లక్షల 92 వేల 5 వందల 17)కు చేరింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 3,876 కోవిడ్19 మరణాలు సంభవించాయి. భారత్‌లో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2,49,992కి చేరింది. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 3,56,082 మంది కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: 7th Pay Commission: ఉద్యోగులకు భారీగా పెరగనున్న వేతనాలు, త్వరలోనే 3 DA, ఇతరత్రా అలవెన్సులు
భారత్‌లో ఇప్పటివరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 1,90,27,304 (ఒక కోటి 90 లక్షల 27 వేల 3 వందల 4)కి చేరింది. దేశంలో ప్రస్తుతం 37 లక్షల 15 వేల 221 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. తాజాగా పాజిటివ్ కేసుల కన్నా డిశ్ఛార్జ్ కేసులు అధికంగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తుంది. మరోవైపు దేశంలో ఇప్పటివరకూ 17 కోట్ల 27 లక్షల 10 వేల 66 మంది కోవిడ్19 టీకాలు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook