India COVID-19 Cases: అన్‌లాక్ ఎఫెక్ట్, ఇండియాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
India COVID-19 Cases: నిన్న ఒక్కరోజు దేశంలో 19 లక్షల 31 వేల 249 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వీటితో కలిపి ఇండియాలో ఇప్పటివరకూ 38 కోట్ల 52 లక్షల 38 వేల 220 శాంపిల్స్‌కు కోవిడ్19 టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది.
India COVID-19 Cases: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్రమేపీ తగ్గుతుందని భావిస్తున్న తరుణంతో పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 67,208 మంది కరోనా బారిన పడ్డారు. వీటితో కలిపితే దేశంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,97,00,313 (2 కోట్ల 97 లక్షల 313)కు చేరుకుంది. నిన్నటితో పోల్చితే దాదాపు 5 వేల పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయి.
అదే సమయంలో దేశంలో నిన్న ఒక్కరోజు 2,330 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. ఇప్పటివరకూ ఇండియాలో కరోనా మరణాల సంఖ్య 3,81,903 (3 లక్షల 81 వేల 903)కు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,03,570 (1 లక్షా 3 వేల 5 వందల 70) మంది కోవిడ్19 (CoronaVirus) మహమ్మారిని జయించారు. ఇప్పటివరకూ 2 కోట్ల 84 లక్షల 91వేల 670 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,26,740కు దిగొచ్చింది. కానీ పలు రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియ మొదలుపెట్టడంతో కరోనా కేసులు గత రెండు రోజులనుంచి మళ్లీ పెరుగుతుండటం గమనార్హం.
Also Read: Delta Plus Variant of COVID-19: డెల్టా ప్లస్ వేరియంట్ నిజమే, B.1.617.2.1పై స్పందించిన కేంద్రం
కరోనా యాక్టివ్ కేసులు 71 రోజులలో కనిష్టానికి చేరుకున్నాయి. గత ఏడాది నుంచి భారత్‌లో ఇప్పటివరకూ 26,55,19,251 (26 కోట్ల 55 లక్షల 19 వేల 251) కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజు దేశంలో 19 లక్షల 31 వేల 249 శాంపిల్స్‌కు కరోనా (COVID-19) నిర్ధారణ పరీక్షలు చేయగా, వీటితో కలిపి ఇండియాలో ఇప్పటివరకూ 38 కోట్ల 52 లక్షల 38 వేల 220 శాంపిల్స్‌కు కోవిడ్19 టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది.
Also Read: UAN-Aadhar Linking: ఈపీఎఫ్ ఖాతాకు ఆధార్ అనుసంధానం గడువు పొడిగించిన EPFO
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook