India CoronaVirus Positive Cases: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కర్ఫూలు, లాక్‌డౌన్‌లు ఫలితాన్నిచ్చాయి. కరోనా కేసులు తగ్గుతున్నా, కోవిడ్19 మరణాలు మాత్రం తగ్గడం లేదు. 72 రోజులలో అతి తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా ఏడోరోజూ లక్ష దిగువన కరోనా కేసులు వచ్చాయి. గత 72 రోజులలో దేశంలో నమోదైన అతి తక్కువ కరోనా వైరస్ (CoronaVirus Positive Cases) పాజిటివ్ కేసులు ఇవే. తాజా కేసులతో కలిపితే ఇప్పటివరకూ కరోనా బాధితుల సంఖ్య 2,95,10,410 (2 కోట్ల 95 లక్షల 10 వేల 410)కు చేరుకుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా, ఆదివారం నాడు 3,921 మంది కోవిడ్19తో పోరాడుతూ చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,74,305 (3 లక్షల 74 వేల 305)కు చేరింది.


 Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం 


ఆదివారం ఉదయం నుంచి నేటి ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో 1,19,501 (1 లక్షా 19 వేల 501) మంది కోవిడ్19 (Covid-19) బారి నుంచి కోలుకున్నారు. ఇండియాలో ఇప్పటివరకూ మొత్తం 2,81,62,947 (2 కోట్ల 81 లక్షల 62 వేల 947) మంది కరోనా మహమ్మారిని జయించారు. దాదాపు రెండు నెలల తరువాత దేశంలో యాక్టివ్ కేసులు మిలియన్‌ దిగువకు వచ్చాయి. ప్రస్తుతం 9,73,158 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకూ 25 కోట్ల 48 లక్షల 49 వేల 301 డోసుల కరోనా వ్యాక్సిన్లు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.


Also Read: Steroids for Covid-19 Treatment: ఆ కోవిడ్19 బాధితులకు స్టెరాయిడ్స్‌ వాడకం చాలా ప్రమాదకరం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook