India corona Update: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి 8 వేల దిగువకు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,992 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 12,50,672 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 393 మంది ప్రాణాలు (Corona Deaths in India) కోల్పోయారు. 9,265 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.


కొత్త కేసులు తగ్గినప్పటికీ ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 32 ఒమిక్రాన్ కేసులు (Omicron cases in India) వెలుగు చూశాయి.


మరిన్ని వివరాలు..


దేశవ్యాప్తంగా ప్రస్తుతం 93,277 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. క్రియాశీల కేసులు 559 రోజుల కనిష్ఠానికి తగ్గడం గమనార్హం. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.27 శాతంగా ఉంది.


కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,75,128 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్​ మరణాల రేటు 1.37 శాతంగా ఉంది.


ఇప్పటి వరకు దేశంలో 3,46,82,736 మందికి కరోనా సోకగా.. అందులో 3,41,14,331 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.36 శాతంగా ఉంది. 


వ్యాక్సినేషన్ ఇలా..


నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 76,36,569 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,31,99,92,482 వద్దకు చేరింది.


ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..


ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 269,447,333 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,312,015 మంది మహమ్మారికి బలయ్యారు. 242,297,406 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 21,837,912 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.


Also read: Omicron scare: వ్యాక్సిన్ తీసుకోలేదా? అయితే రేషన్ షాప్స్​ నుంచి మాల్స్​ వరకు నో ఎంట్రీ..!


Also read: Omicron cases: ఒక్క రోజులో 7 ఒమిక్రాన్ కేసులు- మూడేళ్ల చిన్నారికీ పాజిటివ్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook