India reports 8865 new covid 19 cases death count is 197: గడిచిన 24 గంటల్లో దేశంలో 11,07,617 కరోనా పరీక్షలు జరపగా... 8,865 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు  గత 287 రోజుల్లో అత్యల్పంగా కరోనా కేసులు నమోదవ్వగా.. ఇండియాలో కోవిడ్ -19 కేసుల్లో భారీ క్షీణత కనిపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం నమోదైన కేసులతో పోలిస్తే సోమవారం నమోదైన కేసుల్లో 13.3% తగ్గింది. ఇప్పటివరకు భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 3,44,56,401కి చేరుకుంది. కరోనా కేసుల్లో టాప్ లో ఉన్న రాష్ట్రాల్లో అత్యధికంగా కేరళలో (Kerala) 4,547 కేసులు నమోదవ్వగా.. తమిళనాడులో (Tamilnadu) 802 కేసులు, పశ్చిమ బెంగాల్ (West Bengal)లో  782 కేసులు, మహారాష్ట్రలో 686 కేసులు. మిజోరంలో 611 కేసులు నమోదయ్యాయి.


Also Read: Aadhaar Download: హుర్రే.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, OTP లేకుండానే ఆధార్‌కార్డ్ డౌన్‌లోడ్


ఈ ఐదు రాష్ట్రాల్లో 83.79% కొత్త కేసులు నమోదవ్వగా.. దీంట్లో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 51.29% కొత్త కేసులు నమోదయ్యాయి 


24 గంటల్లో 197 కోవిడ్ మరణాలు
గడిచిన 24 గంటల్లో 197 మంది వైరస్‌ బారిన పడి మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,63,852కి చేరుకుంది. అత్యధికంగా కేరళలో 127 మంది ప్రాణాలు కోల్పోగా, మహారాష్ట్రలో 19 మంది కరోనా కారణంగా మరణించారు. అత్యధికంగా కేరళలో 127 మంది ప్రాణాలు కోల్పోగా, మహారాష్ట్రలో 19 రోజువారీ మరణాలు నమోదయ్యాయి.




గత 24 గంటల్లో మొత్తం 11,971 మంది కరీనా నుండి కోలుకోగా.. దీనితో దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,38,61,756కి చేరుకుంది. దీంతో భారత్ రికవరీ రేటు ఇప్పుడు 98.27 శాతానికి చేరుకుంది. గత 24 గంటల్లో యాక్టివ్ (Active covid-19 Cases) కోవిడ్-19 కేసులు 3,303 తగ్గగా.. ప్రస్తుతం భారతదేశంలో యాక్టివ్  కరోనా కేసులు 1,30,793గా ఉంది.


Also Read: 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? పదండి తెలుసుకుందాం


కరోనా వ్యాక్సినేషన్ 
గత 24 గంటల్లో మొత్తం 59,75,469 డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి, దీనితో మొత్తం డోస్‌ల సంఖ్య 1,12,97,84,045కి చేరుకుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook