Do You Know Why Mobile Number is Only 10 Digits: మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు.. ముందుగా ఆ ఫోన్ నంబర్ 10 అంకెలు ఉందా..?? లేదా? అని ఒకటికి రెండు సార్లు చెక్ చేశాము కదా..!! పొరపాటున 9 అంకెలు లేదా 11 అంకెల నంబర్‌ని డయల్ చేస్తే, ఫోన్ రింగ్ అవ్వదు. మొబైల్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉండాలి..?? మరియు దాని వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా..?? అయితే పదండి అదేంటో తెలుసుకుందాం!
దీనికి కారణం NNP...
మొబైల్ నంబర్ 10 అంకెలు ఉండటానికి గల ప్రత్యేక కారణం.. జాతీయ నంబరింగ్ పథకం... అనగా NNP (National Numbering Scheme). 0 నుండి 9 అంకెలలో.. ఫోన్ నంబర్ ఒక డిజిట్ తో మాత్రమే ఉంటే.. కేవలం 10 నంబర్లను మాత్రమే తయారు చేయవచ్చు. ఫలితంగా తయారయ్యే 10 ఫోన్ నంబర్లను 10 మంది మాత్రమే వాడవచ్చు. అదే 0 నుండి 99 అంకెలతో రెండు డిజిట్ లతో ఫోన్ నంబర్ ఉంటే... కేవలం 100 రకాల నంబర్లు మాత్రమే తయారవుతాయి.. ఫలితంగా 100 మంది మాత్రమే ఫోన్ నంబర్లు వాడవచ్చు.
Also Read: Norovirus: నిన్న కరోనా..ఈ రోజు నోరో వైరస్..భయం గుప్పిట్లో కేరళ.. లక్షణాలు, చికిత్స
దేశ జనాభా కూడా ఒక కారణం
ఫోన్ నంబర్ 10 అంకెలు ఉండటానికి గల మరో కారణం ఏంటంటే.. మన దేశ జనాభా.. ప్రస్తుతం దేశ జనాభా దాదాపు 130 కోట్లు. ఒకవేళ 9 అంకెలతో కూడిన బేసి సంఖ్యలను ఫోన్ నంబర్ గా పెడితే భవిష్యత్తులో ప్రజలందరికి ఫోన్ నంబర్లు కేటాయించటం వీలుపడదు. అదే విధంగా ఫోన్ నంబర్ 10 అంకెలతో ఉంటే.. గణాంకాల ప్రకారం, వెయ్యి కోట్ల విభిన్న సంఖ్యలను తయారు చేయవచ్చు. భవిష్యత్తులో ఫోన్ నంబర్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మొబైల్ నంబర్‌ను 10 అంకెలగా మార్చారు.
ఇంతకు ముందు ఫోన్ నంబర్ 9 అంకెలే..
2003 సంవత్సరం వరకు మన దేశంలో 9 అంకెల మొబైల్ నంబర్లు మాత్రమే ఉండేవి. కానీ పెరుగుతున్న జనాభా దృష్ట్యా TRAI దానిని 10 నంబర్లకు పెంచింది. అదే సమయంలో, జనవరి 15, 2021 నుండి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (Telecom Regulatory Authority of India ) ల్యాండ్‌లైన్ నుండి కాల్ చేసేటప్పుడు నంబర్ ముందు సున్నా వేయాలని ఆదేశించింది. డయలింగ్ పద్ధతిలో ఈ మార్పుతో, టెలికాం కంపెనీలు మొబైల్ సేవల కోసం 2544 మిలియన్ అదనపు నంబర్‌లను సృష్టించే సదుపాయాన్ని పొందుతాయి.
Also Read: Rape Case on Hardik Pandya: సంచలనం.. టీమిండియా ఆటగాళ్లపై 'గ్యాంగ్ రేప్' ఆరోపణలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి