India Corona Update: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా సంక్రమణలో పెరుగుదల కన్పిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్(Coronavirus)సంక్రమణ దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కేసులు ఇప్పుడు స్థిరంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 45 వేల 83 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.నిన్నటితో పోలిస్తే కోవిడ్ 3.26 శాతం తక్కువేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 26 లక్షల 95 వేలకు చేరుకుంది. ఇందులో 3 కోట్ల 18 లక్షల 87 వేల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3 లక్షల 68 వేల 558 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 460 మంది కోవిడ్ కారణంగా మరణించారు. కరోనా సంక్రమణ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దేశంలో 4 లక్షల 37 వేల 830 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు(Corona Recovery Rate) 97.53 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ(Union Health Ministry) వెల్లడించింది. గత 24 గంటల్లో దేశంలో 35 వేల 840 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.


Also read: West Bengal: ఈడీ సమన్లపై కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ మమతా బెనర్జీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook