ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి భారత్‌లో మరో వ్యక్తిని బలి తీసుకుంది. 68 ఏళ్ల వ్యక్తి ముంబైలో కన్నుమూశాడు. ఇది మహారాష్ట్రలో మూడో కరోనా మరణం కాగా, భారత్‌లో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 7కు చేరుకుంది. తాజాగా చనిపోయిన వృద్ధుడు ఫిలిప్పీన్స్‌కు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు.  కరోనాను వాడేస్తున్న పులిహోర రాజాలు..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


భారత్‌లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 415కు చేరుకుంది. తాజాగా 19 కేసులు నమోదైనట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి 22న దేశ వ్యాప్తంగా 14 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించినా మరుసటి రోజు పాజిటీవ్ కేసులు అధికంగానే నమోదవుతున్నాయంటే వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని అర్థమవుతోంది. ఇటలీలో కరోనా మరణ మృదంగం



దేశంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. సోమవారం కొత్తగా 15 కరోనా కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 89కి చేరుకుంది. కాగా, శనివారమే ముంబైలో 63 ఏళ్ల వృద్ధుడు కరోనాతో బాధపడుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. పాట్నాలో మృతి చెందిన 38 ఏళ్ల యువకుడితో కలిపి కరోనా మరణాలు 6కు చేరింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone 


ఇస్మార్ట్ భామ అందాల ‘నిధి’ Bold photos