ఒక్క రోజులో 5 వేలు దాటిన కేసులు..!!
`కరోనా` మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. భారత దేశంలో రోజు రోజుకు కేసుల సంఖ్య రికార్డుస్థాయికి చేరుకుంటోంది. 10 రోజుల క్రితం వరకు వందల సంఖ్యకు పరిమితమైన ఒక్క రోజు కేసుల సంఖ్య.. ఇప్పుడు ఏకంగా 5 వేలు దాటిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
'కరోనా' మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. భారత దేశంలో రోజు రోజుకు కేసుల సంఖ్య రికార్డుస్థాయికి చేరుకుంటోంది. 10 రోజుల క్రితం వరకు వందల సంఖ్యకు పరిమితమైన ఒక్క రోజు కేసుల సంఖ్య.. ఇప్పుడు ఏకంగా 5 వేలు దాటిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇన్నాళ్లూ లాక్ డౌన్ విధించి పకడ్బందీగా అమలు చేసినా.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం విశేషం. నేటి నుంచి చాలా వరకు ఆంక్షలకు సడలింపు ఇచ్చి లాక్ డౌన్ 4.0 అమలు చేస్తున్నారు. దీంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందనే భయాందోళన నెలకొంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5 వేల 242గా నమోదైందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య ఏకంగా 96 వేల 169కి ఎగబాకింది. అంటే దాదాపు లక్ష కేసులకు అతి సమీపంలో ఉందని అర్ధం.
నిన్న ఒక్కరోజే 5 వేల 242 కొత్త కేసులు నమోదు కావడంతోపాటు మృతుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. దేశవ్యాప్తంగా 24 గంటల్లో 157 మంది మృతి చెందారు. ఒక్క రోజులో మృతి చెందిన వారి సంఖ్య ఇదే అత్యధికం కావడం విశేషం. మొత్తం ఇప్పుడు దేశవ్యాప్తంగా 56 వేల 316 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు 36 వేల 823 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుని సురక్షితంగా ఇంటికి వెళ్లారు. మొత్తంగా దేశంలో 3 వేల 29 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ఐతే రికవరీ రేటు 38.29 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఏపీలో మళ్లీ 52 కొత్త కేసులు..!!
దాదాపు లక్ష కేసులు నమోదు కావడంతో భారత దేశంలోనూ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న టాప్ 10 దేశాల సరసన భారత్ కూడా చేరడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దేశంలో మహారాష్ట్రలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 33 వేల 53 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో 11 వేల 379 కేసులతో గుజరాత్, 11 వేల 224 కేసులతో తమిళనాడు, 10 వేల 54 కేసులతో ఢిల్లీ ఉన్నాయి. మృతుల సంఖ్యలోనూ మహారాష్ట్రదే రికార్డుగా ఉంది. మహారాష్ట్రలో మృతుల సంఖ్య 1198గా ఉండగా.. గుజరాత్‌లో 659, మధ్యప్రదేశ్‌లో 248 గా ఉంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..