24 గంటల్లోనే 3 వేల 970 కేసులు..!!
`కరోనా వైరస్` పాజిటివ్ కేసుల సంఖ్య భారత దేశంలో శరవేగంగా పెరుగుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చైనాను దాటేసింది. చైనాలో ఇప్పటి వరకు 84 వేల 29 కేసులు నమోదు అయ్యాయి. ఐతే దీన్ని శుక్రవారం నాటికే భారత్ దాటేసింది.
'కరోనా వైరస్' పాజిటివ్ కేసుల సంఖ్య భారత దేశంలో శరవేగంగా పెరుగుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చైనాను దాటేసింది. చైనాలో ఇప్పటి వరకు 84 వేల 29 కేసులు నమోదు అయ్యాయి. ఐతే దీన్ని శుక్రవారం నాటికే భారత్ దాటేసింది.
శనివారం నాటికి దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 85 వేల 940కి చేరుకుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2 వేల 752 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 53 వేల 35 మంది కరోనా వైరస్‌కు చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 30 వేల 152 మంది చికిత్స తీసుకుని సురక్షితంగా ఇంటికి వెళ్లారని వివరించింది.
నిన్న ఒక్క రోజే కొత్తగా 3 వేల 970 కేసులు నమోదు కావడం విశేషం. అంతే కాదు 24 గంటల్లో 103 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. కేసులు సంఖ్యలో గానీ, మృతుల సంఖ్యలో గానీ ఒక్కరోజులో నమోదైన రికార్డు ఇదే అత్యధికం కావడం విశేషం. ఐతే మొత్తంగా రికవరీ రేటు మాత్రం 35.08 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
నిన్న మొత్తంగా 103 మంది కరోనా వైరస్ ధాటికి మృతి చెందారు. ఇందులో మహారాష్ట్ర నుంచే మృతుల సంఖ్య అత్యధికంగా ఉంది. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 49 మంది చనిపోయారు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న గుజరాత్‌లో 20 మంది, పశ్చిమ బెంగాల్‌లో 10 మంది చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో 8 మంది బలయ్యారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..