Army Chief MM Naravane: న్యూ ఢిల్లీ: లడక్ సరిహద్దులో భారత్, చైనా సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే ( MM Naravane ) మంగళవారం లఢక్ చేరుకున్నారు. లఢక్‌లోని తూర్పు సరిహద్దులో భారత్, చైనా సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణ తరువాత పరిస్థితి గంటగంటకు మారుతోంది. ఇలాంటి పరిస్థితిలో భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే లఢక్ చేరుకున్నారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా ఉదయం ఢిల్లీ ( Delhi ) నుంచి బయల్దేరిన ఆర్మీ చీఫ్ మధ్యాహ్నం లేహ్ చేరుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

( Also read : Indo-China war: ఇండో చైనా వార్‌ జరిగితే.. ఇండియాదే పై చేయి అంటున్న నివేదిక )


లేహ్ చేరుకున్న వెంటనే తొలుత మిలిటరీ ఆసుపత్రిని సందర్శించారు. గాల్వన్ లోయలో (  Galwan Valley ) చైనా సైనికుల దాడిలో గాయపడిన సైనికులు అక్కడ చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించిన ఆర్మీ చీఫ్ అనంతరం 14  కార్ప్స్ అధికారులతో (14 Corps indian army) సమావేశం జరుపుతారు. చైనాతో సరిహద్దు వివాదంపై కొనసాగుతున్న చర్చల గురించి అడిగి తెలుసుకున్నారు.


( Also read : India vs China: తూర్పు లడ్డాఖ్‌లో కీలక పరిణామం )


దీనికి ముందే భారత వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ ( Indian Air Force ) మార్షల్ రాకేవ్ కుమార్ సింగ్ భదౌరియా ( Rakesh Kumar Singh Bhadauria ) కూడా ఇటీవలే లేహ్ లోని  ఎయిర్ బేస్‌ను సందర్శించారు. జూన్జ 15-16  తేదీల్లో తూర్పు లఢక్ సరిహద్దులోని గాల్వన్ లోయలో భారత్, చైనా అధికారుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు ( Colonel Santosh Babu )  తో పాటు 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. మరోవైపు భారత ప్రభుత్వం చైనాపై చర్యలు తీసుకోవాలని సన్నాహాలు చేస్తోంది. ఇలాంటి సందర్భంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ నరవాణే లఢక్ పర్యటన కీలకంగా మారింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..